AP: నువ్వా…నేనా పెద్దిరెడ్డి వర్సెస్ జేసీ…. భయం గుప్పట్లో తాడిపత్రి వాసులు!

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాలలో తిరిగి ఫ్యాక్షన్ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తాడిపత్రిలో కూడా ఒక్కసారిగా ఫ్యాక్షన్ భగ్గుమనిందని చెప్పాలి. తాడపత్రిలో ఎప్పటినుంచో జేసీ వర్సెస్ పెద్దిరెడ్డి అనే విధంగా వివాదాలు నడుస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి తాడిపత్రి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆయన తాడిపత్రిలోకి తిరిగి రావాలని ప్రయత్నం చేస్తుండగా జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం తనని అడ్డుకొని తీరుతామంటూ సవాల్ విసురుతున్నారు.

ఉరవకొండలో సీఎం ప్రోగ్రాం, వీరజవాన్ మరణంతో పోలీసులు ఆ పనుల్లో నిమగ్నమై ఉండటంతో భద్రతా కారణాల రీత్య ఆయన రాక కొంత ఆలస్యమైనట్లు సమాచారం. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి సంకేతాలు పంపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు సుమారు 200 మందితో భద్రత ఏర్పాట్లను కూడా నిర్వహించారు.

పెద్దారెడ్డి రాకతో ఏమైనా గొడవలు జరిగితే ఎక్కడ తాము ఇరుక్కోవాల్సి వస్తుందోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కుటుంబాలకు దూరమవడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని భయం ఇరువురి పార్టీల కార్యకర్తలలో మొదలైందని తెలుస్తుంది. ఇదే విషయం గురించి ఇప్పటికే పోలీసులు కూడా ఇరువురి కార్యకర్తలకు హెచ్చరికలను జారీ చేశారు.

ఎన్నికల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రి వదిలి వెళ్లిపోయారు. అయితే ఆయన తిరిగి తాడిపత్రి పట్టణంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే జెసి వర్గీలు అడ్డుకుంటున్నారు. ఇదే విషయంపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించడంతో కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి అనుమతి తెలిపింది.హైకోర్టు అనుమతి ఉన్నా ఇప్పటికే రెండుమూడు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ సారి తప్పనిసరిగా తాడిపత్రికి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.