Health Tips: ఉదయమే పెరుగు,పంచదార కలిపి తినటం వల్ల ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!

Health Tips:శరీర ఆరోగ్యానికి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. పరగడుపునే పెరుగు చక్కెరను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరుగులో విటమిన్ బి2, విటమిన్ బి 12, మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. పెరుగు శరీరానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. పెరుగు తినడం వల్ల శరీరానికి, మనసుకి అనేక ప్రయోజనాలను కలుగజేస్తుంది. పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, పొట్ట సమస్యలు దూరమవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ పెరుగులో లభిస్తాయి, అందువలన దీనిని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఒట్టి పెరుగు మాత్రమే కాకుండా.. పెరుగు తో పాటుగా చక్కెర కలుపుకుని ఉదయాన్నే తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో పెరుగు పంచదార కలుపుకుని తినడం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. శరీరానికి తగినంత గ్లూకోజ్ లభించి తక్షణ శక్తిని కలుగ జేస్తుంది.

• ఉదయాన్నే పెరుగు, పంచదార కలిపి తినడం వల్ల పొట్టలో చలువను పెంచుతుంది. ఇది పొట్టలో చికాకు, ఎసిడిటీ తగ్గించి, మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.
• పెరుగు, పంచదారను ఉదయాన్నే తినడం వల్ల మీ శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియాను అందజేస్తుంది.పెరుగులోనీ మంచి బాక్టీరియా మీ ప్రేగులకు మేలు చేయడమే కాకుండా పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిని రోజు తినడం వల్ల రోగ నిరోధక శక్తి మెండుగా లభిస్తుంది
• తక్కువగా నీరు తాగే వారిలో యూరినరీ ఇన్ఫెక్షన్ మొదలై టాయిలెట్ సమయంలో నొప్పి లేదా మంట కలుగుతుంటాయి. పెరుగు,చక్కెర రోజు తినడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
• పెరుగు, చక్కెరను కలిపి తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందుతుంది. మీ శరీరాన్ని మనసుని ప్రశాంతంగా ఉంచి… మీరు రోజంతా చురుకుగా ఉండటంలో సహాయ పడుతుంది.
• పాల కంటే పెరుగు త్వరగా జీర్ణమవుతుంది. పెరుగు తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే పెరుగు లేదా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.