రాజకీయాలలో పునీతులు ఎవరు? నిజాన్ని నర్మగర్భంగా, నిర్భయంగా ఒప్పుకునేంత! దమ్ము ఏనాయకుడి ఉంది? అదీ నేటి రాజకీయాల్ని ఉద్దేశించి నీతి, నిజాయితీ గురించి మాట్లాడితే! అంతకన్నా పెద్ద బూతు మరొకటి ఉండదేమో! ఎందుకంటే నాటి-నేటి రాజకీయాల్ని సరిపోల్చితే వ్యత్యాసం అనేది ఊహించనంతగా ఉంటుంది. స్కామ్ లు..స్కీమ్ లు లేని రాజకీయాల గురించి నేటి సామాన్య ప్రజానీకానికి తెలియదంటారా? దశాబ్ధాలుగా కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థల గురించి ప్రజలకు తెలియదంటారా? ప‌్రజలు ప్రతీదాన్ని దగ్గరుండి చూస్తున్నారు. వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు. సాధ్యాఅసాధ్యాలను విశ్లేషించే సామార్ధ్యం కాస్తో..కూస్తో ఏర్పడింది.
ఆ వాస్తవాల్ని పక్కనబెట్టి మెయిన్ ట్రాక్ లోకి వస్తే అవిభాజిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ర్టం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడిందో తెలిసిందే. రాజకీయ ప్రయోజనాల కోసం నాటి క్రాంగెస్ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ర్టాలుగా ఏర్పాటు చేసింది. నాటి నుంచి ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి ప్రజలకు స్పష్టంగా తెలిసిందే. 2014 లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆర్ధికంగా రాష్ర్టాన్ని ముందుకు నడిపించడానికి పడరాని పాట్లు పడ్డ మాట వాస్తవం. ఈ క్రమంలో ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చింది. అవసరం మేర తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అమరావతి రాజధాని పేరుతో ఎంత నొక్కేసారు? ఇంకా ఎక్కడెక్కడ ఎంత వెనకేసారు? అన్నది పక్కనబెడితే 2019 కి ఆ బాధలు, బంధీల నుంచి చంద్రబాబు బయటకు వచ్చేసారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వాటన్నింటిని నెత్తిన వేసుకుని మోస్తున్నారు. జగన్ వాగ్ధానాలను నెరవేర్చడం కోసం ఈయన భారీగానే అప్పులు చేసారు. పాత అప్పులు..కొత్త అప్పులు కలిపి ఇప్పటివరకూ తడిపిమోపుడైంది. ప్రస్తుతాని జగన్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్ నేరుగా జనాల అకౌంట్లో జమ చేస్తున్నారు. వాటిని జనాలు మంచిగా ఖర్చు చేసుకుంటున్నారు. ఆ అప్పులు కట్టాల్సిన బాధ్యత కూడా మనదే అన్న విషయాన్ని మర్చిపోకపోతే పర్వాలేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం..ప్రజలు ఆయన ఫలాల్ని అందుకున్నంత కాలం ఈ కథ అలా సాగిపోతుంది. జగన్ ని అడిగేది ఎవరు? ప్రతి పక్షం ప్రశ్నించినా జగన్ కేర్ చేస్తారా.