Beauty Tips: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. చర్మ సంరక్షణకై చాలా మంది మార్కెట్లో దొరికే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ వాటి వల్ల ఆశించిన మొత్తంగా ఫలితం లభించదు. పైసా కర్చు లేకుండా చర్మ సౌందర్యం కాపాడుకోవచ్చని ప్రఖ్యాత చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ నివేదిత దాదు వెల్లడించారు. కొన్ని సులువైన మార్గాలను అనుసరించటం వల్ల చర్మ సౌందర్యం కాపాడుకోవచ్చని ఆమె తెలియజేశారు.
వారానికి ఒకసారి పిల్లో కవర్స్, బెడ్ షీట్ మారుస్తూ ఉండాలి. ఎక్కువ రోజులు వాటిని అలాగే వాడటం వల్ల తలలో ఉన్న చుండ్రు, అయిల్,దుమ్ము, ధూళి కణాలు పేరుకుపోతాయి. అందువల్ల వారానికి ఒకసారి క్రమం తప్పకుండా పిల్లో కవర్స్, బెడ్ షీట్స్ మారుస్తూ ఉండాలి. నిద్రపోయే సమయంలో చాలా మంది ముఖాన్ని తలగడకి అనించి నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల మొహం మీద మొటిమలు, ముడుతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ రక్షణకు ఎంతో ఉపయోగ పడుతుంది. వ్యాయామం చేయటం వల్ల శ్రారీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ చమట రూపంలో బయటికి వస్తుంది. అలాగే శరీరంలో పోషకాలు అన్ని అవయవాలకు సమానంగా అందుతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
ఈ మధ్య కాలంలో మొబైల్ లేకపోతే ఎవ్వరికీ రోజు గడవదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎప్పుడు మొబైల్ చూస్తూనే ఉంటాం. మనం ఉపయోగించే మొబైల్ నీ తరచూ శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే మనం ఉపయోగించే మొబైల్ మీద టాయిలెట్ మీద కంటే ఎక్కువ క్రిములు ఉంటాయి. తరచూ మొబైల్ స్క్రోల్ చేస్తూ ఆ చేతులతో ముఖాన్ని తాకటం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.