Walnut: వాల్ నట్స్ పొడి తీసుకుంటున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

Health Tips: డ్రై ఫ్రూట్ లో శరీర ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు గుప్పెడు డ్రై ఫ్రూట్ తినటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతాయి. ముఖ్యంగా వాల్ నట్స్ ని డ్రై ఫ్రూట్ లో రారాజుగా పరిగణిస్తారు. ప్రతిరోజు వాల్ నట్స్ తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాల్ నట్స్ చూడటానికి మెదడు ఆకారంలో ఉంటాయి. ఇవి తినటానికి అంత రుచిగా లేకపోవటం వల్ల చాలామంది వీటిని తినటానికి ఇష్టపడరు. అలాంటి వారు వాల్ నట్స్ పొడి చేసి పాలలో కలిపి తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వాల్ నట్స్ లో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతి రోజు పాలల్లో వాల్ నట్స్ పొడి కలుపుకుని తాగటం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతే కాకుండా చర్మం మీద ముడతలు తొలగిపోయి వృద్ధాప్య సమస్యలు రాకుండా ఉంటాయి. వర్క్ ప్రెషర్ వల్ల కలిగే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

వ్యాయామాలు, శారీరక శ్రమ ఎక్కువ చేసేవారు పాలల్లో వాల్ నట్స్ పొడి కలుపుకుని తాగటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభించి రోజంతా హుషారుగా ఉంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలల్లో ఈ పొడి కలుపుకొని తాగడం వల్ల పిండం పెరుగుదల బాగుంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక స్పూన్ పాల పొడిని ఒక గ్లాసు పాలలో కలుపుకొని తాగడం వల్ల బిపి, మతిమరుపు, గుండె సంబంధిత సమస్యలు, నిద్ర లేమి వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.