Paracetamol: ఎక్కువ మోతాదులో పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు తప్పవు మరి..!

Paracetamol: దేశంలో కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. కరోనా పుణ్యమా అని దేశంలో పారాసెట్మాల్ టాబ్లెట్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఏ చిన్న జబ్బు చేసినా వెంటనే గుర్తొచ్చేది పారాసెటమాల్, డోలో650 టాబ్లెట్స్. పారాసెటమాల్ టాబ్లెట్స్ జ్వరం,తలనొప్పి,ఒళ్ళు నొప్పులు, జలుబు వంటి సమస్యలను నయం చేస్తుంది. అయితే పారాసెట్మాల్ టాబ్లెట్ వినియోగం ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యంగా ఉందని ఎక్కువ మోతాదులో పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ఏ రకమైన జబ్బు చేసినప్పుడు ఎంత మోతాదులో పారాసిట్మల్ మందులు వాడాలో తెలియక చాలామంది పొరపాటు చేస్తుంటారు. అమితంగా చిన్నచిన్న రోగాలకు ఎక్కువ మోతాదులోఈ మందులు వాడటం వల్ల సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

జ్వరం వచ్చినప్పుడు పెద్దవారు వారి మునుపటి ఆరోగ్య సమస్యలు ,బరువు ,ఎత్తు బట్టి 350 నుండి 650ఎంజీ వరకు జ్వరం వచ్చిన మూడు గంటల లోపు తీసుకోవాలి. జ్వరం వచ్చిన ఆరు గంటల తర్వాత 500 ఎంజి టాబ్లెట్ వేసుకోవచ్చు. చిన్నపిల్లల ఈ విషయంలో కూడా చాలామంది ఈ పొరపాటు చేస్తుంటారు. చిన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు నెల లోపు పిల్లలకు 10_15mg పారాసెట్మాల్ టాబ్లెట్ జ్వరం వచ్చిన 4_6 గంటల వ్యవధిలో ఇవ్వాలి. 12 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలకు ఇదే మోతాదులో ఆరు గంటలకు ఒకసారి మూడు రోజులపాటు ఇవ్వాలి.

జ్వరం తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా మూడు రోజులు మాత్రమే పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి, ఇంకా తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించాలి. పారాసెటమాల్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు అధిక మోతాదులో వేసుకోవటం వల్ల చర్మం మీద దద్దుర్లు, దురద వచ్చే ప్రమాదం ఉంది. పారాసెట్మాల్ టాబ్లెట్ లో స్టెరాయిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాలేయం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడటం మంచిది.