Health Tips:తరచూ నిద్రలో చమటలు పడుతున్నాయా? ఈ లక్షణం అనేక అనారోగ్య సమస్యలకు సంకేతం..!

Health Tips:మునుపటి కాలంతో పోల్చితే ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలకు గురవుతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో టైం కి తిండి, నిద్ర తగినంత తీసుకోక పోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. రోజు మొత్తం కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం, ఎప్పుడు మొబైల్ ఫోన్ చూస్తూ ఉండటం కూడా దీనికి ఒక కారణం. కొంత మంది బెడ్ మీద వాలగానే నిద్రపోతుంటారు, మరికొంతమంది ఎంతసేపు బెడ్ మీద పడుకున్న కూడా నిద్ర పట్టక అవస్థలు పడుతుంటారు. అయితే కొంత మంది పడుకున్న తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు చెమటలు పట్టి నిద్ర డిస్టర్బ్ అవుతుంటుంది ప్రతి అనారోగ్య సమస్యలకు శారీరక లక్షణాలు కచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక రోజు అలా జరిగితే పర్వాలేదు, రోజు నిద్ర సమయంలో చెమటలు పడుతుంటే మాత్రం… మీ శరీరం ఏదో వ్యాధి బారిన పడుతున్నట్టు గా మీరు గుర్తించాలి. నిపుణులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

మీ శరీరం గనుక క్యాన్సర్ బారిన పడినట్లయితే నిద్రవేళలో చెమటలు పట్టే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం క్యాన్సర్ మీ శరీరం మీద దాడి చేస్తున్నప్పుడు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి దాని మీద ప్రభావం చూపి జ్వరం, చెమటలు వస్తాయి. ఈ లక్షణాలు కొన్ని రకాల క్యాన్సర్ వల్ల వస్తాయని నివేదికలో పేర్కొన్నారు.

సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో అనేకమంది గ్యాస్టిక్ సమస్యల బారిన పడుతున్నారు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజార్డర్ కారణంగా రాత్రిపూట నిద్రించే సమయంలో చెమటలు పట్టే అవకాశం ఉంది.నిద్రించే సమయంలో ఆహారం గొట్టంలో గ్యాస్ ఫామ్ అయ్యి ఛాతీలో మంట, చెమటలు మొదలవుతాయి.

టీబి వ్యాధిగ్రస్తులలో కూడా రాత్రిపూట నిద్ర వేళలో చెమటలు పడుతుంటాయి. టీబి వ్యాధి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది ఫలితంగా శరీరంలో చెమటలు వస్తాయి. ఈ వ్యాధిగ్రస్తుల శరీర బరువు కూడా తగ్గుతుంది. టీబి, గ్యాస్టిక్ సమస్యలు లేకపోయినా కూడా నిద్ర వేళలో చెమటలు పడుతుంటే డాక్టర్ ను సంప్రదించండి. వ్యాధిని త్వరగా గుర్తిస్తే దాని నివారణ మార్గాలు దొరుకుతాయి.