Health Tips: నిరంతరం తల నొప్పితో బాధపడుతున్నారా? ఈ విటమిన్ లోపమే కారణం..!

Health Tips:తలనొప్పి అనేది చిన్న వారు, పెద్ద వారు, పిల్లలు, అనే భేదం లేకుండా అందరినీ తరచూ వేధిస్తున్న సమస్య. తలనొప్పి దేని కారణంగా వస్తుందని కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. తల నొప్పిని తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాము, కానీ అది దేని కారణంగా వచ్చింది అని మాత్రం ఎవరూ ఆలోచించరు. మారిన ఆహారపు అలవాట్లు, టెన్షన్లు, వాతావరణ మార్పుల వల్ల చాలామంది తరచూ తలనొప్పి గురవుతుంటారు. కొంతమంది అయితే ఎక్కువ శబ్దాలు విన్నా కూడా తలనొప్పికి గురవుతారు. అయితే ఇవి మాత్రమే కాకుండా మీ శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు, విటమిన్లు తక్కువ అయినప్పుడు కూడా తల నొప్పి సమస్యలు వస్తుంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకోవడం వల్ల తలనొప్పిని కొంతవరకు నివారించవచ్చు.

శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం వల్ల కూడా కొంతమందిలో తలనొప్పి వస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడాన్ని డీహైడ్రేషన్ అని అంటారు. మీరు అప్పుడప్పుడు తలనొప్పి గురవుతుంటే మీ శరీరంలో నీటి శాతం తగ్గుతున్నట్టు గమనిక. నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. రోజులో కనీసం రెండు లీటర్ల నీటిని తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచవచ్చు.

విటమిన్-డి శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అయితే విటమిన్ డి లోపం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సూర్యకాంతి వల్ల విటమిన్ డి శరీరానికి లభిస్తుంది. మీ చర్మం ఎండ వేడిమికి గురైనప్పుడు చర్మం కింద ఉన్న కొలెస్ట్రాల్ కరిగి విటమిన్-డీ గా తయారవుతుంది. సూర్య కాంతితో పాటు చేపలు, పాల ఉత్పత్తులు, నారింజ, బీన్స్ విటమిన్ డి ను అందించగలవు. తగినంతగా విటమిన్-డి ని శరీరం పొందితే కొన్ని రకాల తలనొప్పులు నుండి ఉపశమనం పొందవచ్చు.