Skin Care: మనం ప్రతి రోజు స్నానం చేసే సమయంలో మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తున్నాము. అయితే మనకు తెలియకుండా చేసిన ఈ తప్పుల కారణంగా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది అది ఏ కాలం అయినా కానీ వేడి నీళ్లు లేనిదే స్నానం చేయరు. తప్పనిసరిగా వేడినీళ్లు ఉంటేనే స్నానం చేయడానికి ఇష్టపడతారు. అలాగే మరికొందరు చన్నీటితో స్నానం చేయడానికి కూడా ఇష్టపడతారు.నిజానికి చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా వేడి నీళ్ళు అయినా చన్నీళ్ల స్నానం చేసేటప్పుడు చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ ఎన్నో తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో చాలామంది సబ్బును ఎక్కువ సమయం పాటు శరీరంపై రుద్ది స్నానం చేస్తారు. ఇలా చేయటం వల్ల సబ్బులో ఉన్న రసాయనాలు అధిక ప్రభావాన్ని చూపిస్తూ మన చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది. అలాగే చాలామంది శరీరంపై ఉన్న మురికి పోవడం కోసం బాగా రుద్ది రుద్ది స్నానం చేస్తారు. ఇలా చేయటంవల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోవడమే కాకుండా చర్మం మొత్తం ఎర్రబడుతుంది.
అదే విధంగా ఎక్కువ సమయంపాటు సబ్బు రుద్దడం వల్ల చర్మం పై మొటిమలు మచ్చలు ఏర్పడతాయి. అందుకే వీలైనంత వరకు తొందరగా స్నానం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక వేడినీటితో కన్నా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. తెల్లరక్త కణాల సంఖ్య అభివృద్ధి చెందుతుంది. మానసిక సమస్యలు ఒత్తిడి డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.