వివాహం అయిన తర్వాత మగవారు చేయకూడని తప్పులు ఇవే.. లేకపోతే జీవితం నరకమే..!

పెళ్లంటే ఒక్క వేడుక కాదు. జీవితాంతం ఒకరిని అర్థం చేసుకునే ప్రయాణం. ఈ ప్రయాణంలో అనుకోకుండా కొన్ని చిన్న తప్పులు జరుగుతుంటాయి. మగవారు చేయగలిగే అతి సాధారణమైన తప్పులే… వారి వైవాహిక జీవితంలో తలనొప్పులుగా మారిపోతున్నాయి. ఇవి చూపడానికి చిన్నవాటే కావచ్చు కానీ, దీర్ఘకాలంలో మనశ్శాంతిని దూరం చేసే శక్తి కలిగినవే. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం లోతుగా ఉండాలంటే, ఎమోషనల్ కనెక్ట్ తప్పనిసరి.

మగవారు చాలాసార్లు ఎమోషన్లను బయటపెట్టాలంటే ఏదో తక్కువతనంగా భావిస్తారు. కానీ ఇది పెద్ద తప్పే. భావాలను పంచుకోవడం వల్లే జీవిత భాగస్వామి మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు ఏమిటి అనుకుంటున్నారో, ఏమి అనుభవిస్తున్నారు అనేది ఆమెకు తెలియాలి. అలాగే, భార్య చెప్పే విషయాలను ‘వినడం’ కూడా ఒక మంచి గుణం. పరిష్కారం చెప్పలేకపోయినా, సమస్యను మనస్పూర్తిగా వినడం వల్ల ఆమెలో విశ్వాసం పెరుగుతుంది. మీరు ఆమెకి బలమైన సహాయకుడిగా కనిపిస్తారు.

మరొక ముఖ్యమైన విషయం ఖర్చు విషయంలో తొందరపాటు వద్దు. చాలామంది మగవారు ముందుగానే ఆలోచించకుండా ఖర్చులు చేయడమే గొడవలకు కారణమవుతుంది. భార్యతో కలిసి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే, లైంగిక జీవితం విషయంలో కూడా రెండూ పక్షాల భావోద్వేగాలు గుర్తించి స్పందించడం ముఖ్యం. శృంగారం ఒక్కటే కాకుండా… ప్రేమ, మమకారం, జ్ఞాపకాలు, గౌరవం అన్నీ కలిసే నిజమైన అనుబంధం. ఆమె ఆ సమయంలో మీ నుంచి ఏం ఆశిస్తోంది? అన్నదాన్ని అర్థం చేసుకోవడమే మీరు నిజంగా బంధాన్ని విలువైనదిగా మార్చే దారిలో ఉన్నారనే సంకేతం.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సానుభూతి చూపడం. భార్యను తక్కువ చేసి చూసే భర్తలతో పోలిస్తే, ఆమెను అర్థం చేసుకునే భర్తలతో సంబంధం మరింత బలపడుతుంది. చిన్న సమస్యలైనా, వాటిని పట్టించుకుని స్పందించడం ద్వారా మీ అర్థాంగికి మీరు ఎంతో విలువైనవారిగా కనబడతారు. వివాహం అనేది ఒక బంధం మాత్రమే కాదు, అది బాధ్యతల మేళవింపు. ప్రేమ, ఆప్యాయం, గౌరవం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది సుస్థిరంగా ఉంటుంది. ప్రతి మగవాడు ఈ సాధారణ విషయాలపై కాస్త ఫోకస్ పెడితే, వారి మ్యారేజ్ లైఫ్ మధురంగా, బలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.