గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలిసే పెరుగుతాయి?

హిందూ సంప్రదాయంలో కొన్ని చెట్లకు బాగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్క, రావి చెట్టు, వేప చెట్టు. ఈ మూడు చెట్లను దైవంతో భావిస్తారు హిందువులు. అంతే కాకుండా నిత్యం దీపారాధనతో పూజలు చేస్తారు. ఇక ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ కాకుండా స్వచ్ఛమైన ప్రదేశంలో పెరుగుతుంటాయి.

ముఖ్యంగా రావిచెట్టు, వేప చెట్టు కలిసి పెరిగితే మాత్రం అక్కడ కచ్చితంగా దైవ బలం ఉన్నట్లే. చాలావరకు ఈ రెండు చెట్లు గుళ్ళల్లో కనిపిస్తాయి. ఒకవేళ వేపచెట్టు కాకుండా రావిచెట్టు ఒంటరిగా ఉంటే మాత్రం అది ఇంటి ఆవరణలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే రావిచెట్టు ఒంటరిగా ఉంటే కొన్ని దుష్ప్రభావాలు ఎదురవుతాయని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

ఇక రావిచెట్టును అశ్వథ వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదెలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాలలో సర్వదేవ సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది విష్ణు స్వరూపం అని చెప్పాలి. మహాత్ములు దీనిని పుణ్యం మూలమని సేవిస్తారు.

ఇక వేప చెట్టులో లక్ష్మీదేవి అంశం ఉంటుందని కూడా తెలుసు. దీంతో ఈ రెండు చెట్లను కలిపి పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శని దోషం ఉన్నవారు ఈ జంట వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇక వేపచెట్టు నుండి వీచే గాలులకు ఎన్నో జబ్బులు దూరం అవుతాయని ఒక నమ్మకం. దీనిని ఔషధ మొక్కగా కూడా వాడుతారు.

ఇక ఈ చెట్లు ఎక్కువగా గుళ్ళల్లో పెరగటానికి కారణం స్వచ్ఛమైన ప్రదేశం కాబట్టి. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఈ చెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి. పైగా దేవాలయాల చుట్టూ దైవానుసారం ఉంటుంది కాబట్టి అక్కడ ఈ చెట్లు ఖచ్చితంగా పెరుగుతాయి అని ఒక నమ్మకం. కాబట్టి మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గమనిస్తే ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చితంగా రావి చెట్టు, వేప చెట్టు జంటగా ఉంటాయి.