Mango Leaves: సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు లేదా పండుగల సమయాలలో ఇంటికి మామిడి తోరణాలు కడతారు. ఇలా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు మాత్రమే కట్టడానికి గల కారణం ఏమిటి?మామిడి తోరణాలు కట్టడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం చాలా మందికి తెలియదు. మన పెద్దవాళ్ళు ప్రతి పండుగకు శుభకార్యానికి మావిడాకులు కడుతున్నారు కనుక మనం కడుతున్నామని చెబుతారు. అయితే శుభకార్యాలలో మామిడి తోరణాలను ఎందుకు కడతారో ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం మావిడాకులు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మామిడి ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు.అందుకే ఏదైనా శుభకార్యం జరిగే సమయంలో ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై కలుగుతాయని భావిస్తారు. అందుకోసమే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. అందుకోసమే పూజా కార్యక్రమాలలో మనం కలశం ఏర్పాటు చేసే సమయంలో కూడా మామిడి ఆకులను కలశంలో ఉపయోగిస్తాము.
ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టడం వల్ల మన ఇంటిలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.ఈ క్రమంలోని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. కనుక శుభకార్యాల సమయంలోఎంతో మంది మన ఇంటికి వస్తారు ఈ క్రమంలోనే కొందరి దృష్టి మన ఇంటిపై పడకుండా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా మామిడితోరణాలు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. అందుకోసమే ప్రతి శుభకార్యాల్లోనూ మామిడి తోరణాలు కడతారు.