Mask Importance: రోజుకీ కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దేశంలో కరోనా మూడవదశ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎన్ని టీకాలు వచ్చినా, వాటిని ఎన్ని డోసులు వేసుకున్నా కూడా కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. పచ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి జనవరి 3 వ తేదీ నుంచి విద్యాసంస్థలు మూసివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి ఉన్న మార్గం మాస్క్ వాడటం.
కరోనా నుండి రక్షించే ఆయుధాలలో మొదటి ప్రాధాన్యం మాస్క్దే. ఇది గాలి నుండి వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి మాస్క్ ను సరిగా వేసు కోవడం వల్ల కరోనా వ్యాప్తి అరికట్టవచ్చును. అయితే మార్కెట్ లో చాలా రకాల మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి. ఏవి వాడితే మంచిది , ఏవి ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయో ఒక లుక్ వేయండి.
సాధారణంగా మార్కెట్లో 3 రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. అవి N-95 మాస్కులు, సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు. వీటిలో ఏవి సురక్షితం అనేది అందరికీ ఒక ప్రశ్న. ఈ మూడింటిలో N-95 మాస్క్ చాలా సురక్షితమైనది. ఇది దాదాపుగా 95 శాతం సూక్ష్మ క్రిముల నుండి రక్షణ కల్పిస్తుంది. N-95 మాస్క్ అనేది ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఇది ముక్కు మీద కరెక్ట్ గా జారకుండా కూర్చోవడానికి ఒక ఇనుప ప్లేట్ ఉంటుంది. ఇది 95% కణాలను నిరోధిస్తుంది కాబట్టి దీని కి N-95 మాస్క్ అనే పేరు పెట్టారు. ఈ N-95 మాస్క్ అన్నిటికన్నా చాలా సురక్షితమైన మాస్క్ గా భావించవచ్చు.
ఇక సర్జికల్ మాస్క్ లకు అయితే దాదాపు 89.5 శాతం వరకు కణాలను నిరోధించ గల శక్తి ఉంటుంది. వీటిని దాదాపుగా అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్ని మెడికల్ షాపులలో సులభంగా లభ్యమవుతాయి. వీటి తయారీలో ఎటువంటి మనిషి ఉండరు, మొత్తం మిషన్ ద్వారా ఆటోమేటిక్ గా తయారవుతుంది. అందు వలన ఈ మాస్క్ ని ఎటువంటి అభద్రత భావం లేకుండా వాడవచ్చును.
మూడవ రకం మాస్క్ అయినటువంటి క్లాత్ మాస్కూలు వాడుతున్నట్లయితే అవి 2 లేదా 3 లేయర్లు ఉన్న మాస్కులు వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఒక లేయర్ ఉన్నటువంటి క్లాత్ మాస్క్ లను వాడకపోవడం మంచిది.
సాధారణంగా ప్రజలకు మాస్కులు వాడటం మాత్రమే తెలుసు.. కానీ మాస్కులు తమకు అనుకూలంగా ఉండేలా ధరించాలి. చాలామంది లూస్ గా ఉన్న మాస్క్ ధరిస్తూ ఉంటారు..అటువంటి మాస్క్ ధరించటం వల్ల అది ముక్కు మీద నుండి జారిపోయి గాలి ద్వారా సూక్ష్మక్రిములు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. చాలా గట్టిగా ఉన్న మాస్క్ , మన మొహానికి సరిపోని మాస్క్ ధరించడం వల్ల ఊపిరి ఆడక ఇబ్బంది పడవలసి వస్తుంది