Health Tips: పెరుగు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వేసవి తాపం తగ్గించడం లో పెరుగు ఎంతో సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగు పడి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. భోజనం చివరిలో పెరుగన్నం తినకపోతే అనేకమందికి భోజనం తిన్న తృప్తి కలగదు. కొంతమంది పెరుగులో చక్కెర కలుపుకుని తింటారు, మరికొంతమంది పెరుగు, ఉప్పు కలుపుకుని తింటుంటారు. అయితే పెరుగులో తేనె కలుపుకుని తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పొందటంతో పాటూ… ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
పెరుగులో ఐరన్, కాల్షియం,పొటాషియం,జింక్, యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగును తేనెలో కలపడం వల్ల ఇందులో ఉండే ప్రొటీన్లు అధికం అవుతాయి. పెరుగు తేనె లో కలపడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
• పెరుగులో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ రెండు ప్రొటీన్లు ఎంతో ఉపయోగపడతాయి. ఎముకలు, కండరాల నొప్పులతో బాధపడేవారు తేనే, పెరుగు కలిపి తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
• వేసవిలో అనేక మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు రోజు ఏదో విధంగా కనీసం ఒక కప్పు పెరుగును తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఇదే కాకుండా లస్సీ తీసుకునేవారు లస్సి లో తేనె కలుపుకుని తాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
• పెరుగు, తేనెలలో విటమిన్ సి అధికంగా లభ్యమవుతుంది.తరచూ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ సి లభించి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందిస్తాయి.
• ప్రోటీన్ ను పొందే శాఖాహార మూలాలలో పెరుగు ఒకటి అని అందరికీ తెలిసిన విషయమే. వ్యాయామం చేసేవారు కార్బోహడ్రేట్లు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తినాలి అని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటివారు పెరుగు తేనె కలపడం వల్ల అవసరమైన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి.
• పెరుగు, తేనె రెండూ ప్రోబయోటిక్స్ కలిగి, ఈస్ట్ బ్యాక్టీరియా ఎక్కువగా కలిగి ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడమే కాకుండా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెరుగు, తేనె కలిపి తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరం చేయవచ్చని డాక్టర్లు తెలిపారు. రక్తం గడ్డకట్టడం, అతిసారం, బోలు ఎముకల వ్యాధి, ఊబకాయం, కీళ్ల నొప్పులు, గుండె, రక్త సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.