Health Tips: ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదనలో పడి ఇంటిల్లిపాది డబ్బులు సంపాదించడానికి ఉద్యోగాలు చేస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇంట్లో ప్రతి రోజూ మూడు పూటలా వంట చేసుకుని తినే సమయం లేదు. అందువల్ల ఒకరోజు చేసిన కూరలు, ఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని ఫ్రిజ్ లో ఉంచి తింటుంటారు. కానీ కొన్ని పదార్థాలు ఫేస్బుక్లో పెట్టడం వల్ల తొందరగా గడ్డకట్టి పోతాయి. అలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఫ్రిజ్ లో ఉంచి గడ్డకట్టిన ఆహార పదార్థాలను తినటం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది.అంతేకాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలను తినటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గడ్డకట్టిన ఆహార పదార్థాలు తినటం వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఫ్రిజ్లో ఉంచి గడ్డకట్టిన ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోకి కార్బోహైడ్రేట్లు ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా శరీర బరువు పెరుగుతుంది. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా లేక గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా గడ్డకట్టిన ఆహార పదార్థాలు తినటం వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.