అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, దీనిలో ఉండే విటమిన్లు, పొటాషియం శరీరానికి చాలా మేలు చేస్తాయి.అరటిపండు తింటే తక్షణ శక్తి రావటమే కాకుండా అందులో ఉండే పొటాషియం రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది, అలాగే అరటి పండులో ఉన్న ఫైబర్ మలబద్దక సమస్యలను తగ్గిస్తుంది.. సాధారణంగా ప్రతి ఒక్కరూ అరటిపండు తింటారు, కానీ తొక్క మాత్రం పారేస్తుంటారు. అరటిపండు తొక్క ఎన్నివిదాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందో తొక్కను కూడా వదిలేయారు..
అరటి తొక్కలో విటమిన్లు A, B6, B12 ఉంటాయి, ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డిప్రెషన్ తో భాదపడుతున్నవారు రెండు రోజులు అరటి తొక్కను తింటే శరీరంలో సెరటోనిన్ స్థాయిలను పెంచి డిప్రెషన్ ను తగ్గిస్తాయి. అరటి తొక్కలో విటమిన్ A పుష్కలంగా లభిస్తుంది. దీన్ని మీ వంటలలో, ఆహారంలో భాగం చేసుకోవడం వలన రోగనిరోదకశక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ లతో పోరాడుతుంది. ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెడుతున్న కరోనాను ఎదుర్కోవడానికి రోగనిరోదక శక్తి ఎంతగానో అవసరము. దీనిని పెంచుకోవడానికి అరటి తొక్క భాగ ఉపయోగపడుతుంది.
అరటి తొక్కలో ట్రిప్టోఫాన్ అనే రసాయనం ఉండటం వల్ల దీనిని రోజు తింటే నిద్ర బాగా పెట్టి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దంతాలు పసుపు రంగులోకి మారినప్పుడు, గార పట్టినప్పుడు అరటి తొక్కతో శుభ్రం చేయడం ద్వారా మీ దంతాలు మెరుస్తాయి. అధిక B.P తో భాదపడేవారు అరటిపండు తొక్కను తినడం ద్వారా మంచి ప్రయోజనలు కలుగుతాయి. అరటి తొక్కలో పొటాషియం ఉండటంవల్ల B.P కంట్రోల్ లో ఉంటుంది.
అరటిపండులో కన్నా అరటి తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శీతాకాలంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సందర్బల్లో అరటిపండు, దాని తొక్క తినడం ద్వారా ఎముకలకు కావలసిన కాల్షియం దొరుకుతుంది. అరటిపండు తొక్క తినడం ద్వారా శరీరానికి కావలసిన పీచు పదార్థం అందుతుంది. జీర్ణ వ్యవస్థకు ఫైబర్ చాలా అవసరం అవుతుంది, ఇది అరటి తొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నాయి. అరటి తొక్కను మొహంపై రుద్దితే మొహం మీద ఉన్న మొటిమలు తగ్గి చర్మం నిగనిగలాడుతుంది.