Vastu Directions: సాధారణంగా మనం భోజనం చేస్తున్నప్పుడు మనకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో అక్కడ కూర్చుని భోజనం చేస్తాము. కానీ భోజనం చేసేటప్పుడు ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా భోజనం చేయటం వల్ల అష్ట దరిద్రాలు మన వెంటే ఉంటాయి. అందుకే భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం ఎంతో అవసరం. ముఖ్యంగా భోజనం ఏ దిశలో కూర్చుని తినాలి? ఎలా భోజనం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నం తినేటప్పుడుకొన్ని నియమాలను పాటించాలని ఇష్టానుసారంగా భోజనం చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది కింద కూర్చుని భోజనం చేయడాన్ని మర్చిపోతున్నారు. అయితే భోజనం చేసే సమయంలో ఎప్పుడు కూడా తూర్పు వైపుకు తిరిగి కూర్చోవాలి. ఇలా భోజనం చేయడం ఎంతో మంచిది.అదేవిధంగా రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది పిల్లలను మరుసటి రోజు ఉదయం కడుగుతారు. అలా చేయడం పరమ దరిద్రం.
అలాగే మరికొందరు భోజనం చేసేటప్పుడు పళ్లెం నేలపై కాకుండా వారి మీద పెట్టుకొని భోజనం చేస్తుంటారు. ఇలా ఎప్పుడు తినకూడదు. పల్లె కింద పెట్టి మనం తినేటప్పుడు వంగి తినాలి. అలాగే చాలామంది పెరుగు కూర కలిపి తింటారు అలా ఎప్పటికి తినకూడదు. మరికొందరు భోజనం చేస్తూ వారు అన్నం కలిపేటప్పుడు అన్నం వేళ్ళ మధ్యలో నుంచి వస్తుంది. అలా వేళ్ళ మధ్యలో నుంచి అన్నం వచ్చేలా కలిపి తినకూడదని పండితులు చెబుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం భోజనం చేసే సమయంలో ఎవరైనా వచ్చినా కానీ మధ్యలో వదిలేయకూడదు. ఇలాంటి నియమాలను పాటించడం ఎంతో మంచిది.