ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న , పెద్ద అని తేడా లేకుండా వేదిస్తున్న ఆరోగ్య సమస్యలలో కంటిచూపు సమస్యలు. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది ఎప్పుడు ఫోన్ , టీవీ,కంప్యూటర్లు, ఎక్కువగా వినియోగించటం వల్ల కళ్ళకు చాలా ఒత్తిడిని కలిగిస్తూ మీ కంటి చూపును తగ్గిస్తున్నాయి.ఈ మధ్యకాలంలో పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ కళ్ళజోడు పెట్టుకోవడం గమనిస్తూనే ఉంటాం. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటం వల్ల మనం కంటి చూపుని కాపాడుకోవచ్చుని నిపుణులు సూచిస్తున్నారు.
మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కంటి చూపు విటమిన్ ల మీద ఆధారపడి ఉంటుంది. కంటిచూపును కాపాడుకోవాలంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పోషకపదార్థాలను తీసుకోవాలి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందులో ముఖ్యంగా కంటి చూపు సమస్యలను దూరం చేస్తాయి . ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవటం వలన UV రేస్ ని కంటికి తాగకుండా కాపాడతాయి. ఈ మధ్యకాలంలో చాలామందికి దమ్ము కొట్టడం ఫ్యాషన్ అయింది. ఇది మీ కంటి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. ఈ అలవాటును మానుకోవడం ద్వారా మీ కంటి చూపును కొంచెం కాపాడుకున్నట్టే.
ఎప్పుడూ కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని పనిచేసే వాళ్లకు కంటి చూపు మీద ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారు కుర్చోని కూర్చొని వారి బాడీ వెయిట్ కూడా పెరుగుతుంది. ఒబిసిటీ వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది. ఇలాంటి వారు డీహైడ్రేట్ అవ్వకుండా నీరు ఎక్కువగా తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇవే కాకుండా రాత్రిపూట వీలైనంత తక్కువగా కంప్యూటర్లు , మొబైల్ ఫోన్స్ వాడకం తగ్గించాలి. చేపలు అలవాటున్న వాళ్ళు చేపలు తినడం ద్వారా మీ కంటికి కావలసిన విటమిన్లు లభిస్తాయి. ఇవే కాకుండా ఉదయాన్నే ఎండలో నిలబడడం వలన కంటికి కావలసిన విటమిన్ -డి దొరికి మీ కళ్ళను కాపాడుతుంది.