Covid-19: కరోనా నుండి కోలుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

Covid -19: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దేశంలో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు మునుపటి వేరియంట్లతో పోల్చితే చాలా భిన్నంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ వీటి లక్షణాల తీవ్రత తక్కువగా ఉండటం వల్ల కొంత ఊరట లభిస్తుంది.

దేశంలో కరోనా కేసులు2.82 లక్షలకు చేరుకోగా..8961 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా డెల్టా కేసులతో పోల్చితే ఒమిక్రాన్ వల్ల ప్రాణహాని తక్కువగా ఉంది. ఒమిక్రాన్ చాలా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఒమిక్రాన్ సోకిన వారు సరైన పద్ధతిలో పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ నుండి విముక్తి పొందవచ్చు.

కరోనా నుండి కోలుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు తమ ఆప్తులకు దూరంగా ఉండాలి అన్న సందేహం అందరికీ ఉంటుంది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం అం తేలికపాటి లక్షణాలు ఉన్న పిల్లలు పెద్దలు కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా ఐదు రోజుల పాటు ఇతరులకు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ ఉండాలి.

కరోనా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారు లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుండి పది రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండాలి. లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నవారు లక్షణాలు కనిపించిన క్షణం నుండి 20 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. వీరు కరోనా నుండి కోలుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు తమ ఆప్తులకు దూరంగా ఉండాలి అన్న విషయం గురించి CDC ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదు. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అది గమనించకుండా పాటించడంవల్ల మనకి మరియు ఇతరులకు శ్రేయస్కరం.