Health Tips: సకాలంలో జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రోజుల్లో వంటలు తయారు చేయడానికి వివిధ రకాల వంటనూనెలలు ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో ఆముదం ఉపయోగించి వంటలు చేసేవారు.ఈ కాలంలో చాలామంది యువతకు ఆముదం నూనె గురించి అవగాహన ఉండదు. ఇతర వంట నూనెలతో పోల్చితే ఆముదం నూనె చాలా చిక్కగా ఉంటుంది. ఆముదం నూనెవంటల తయారీలో మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు నయం చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఆముదం నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• ముఖ్యంగా ఆముదం నూనెను తలకు రాసుకుంటారు. ఆముదాన్ని తలకు రాసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఆముదం నూనె ఎంతగానో తోడ్పడుతుంది.
• మలబద్ధకం సమస్యను నివారించడంలో ఆముదం నూనె చాలా ఉపయోగపడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఆముదం నూనె తాగడం వల్ల ప్రేగు లో ఉండే జిగురు శాతం ఎక్కువ అయ్యి మలం విసర్జన సాఫీగా ఉంటుంది.
• ఆముదం నూనెను బాగా వేడి చేసిన తర్వాతే తాగడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
• మోతాదుకు మించి ఆముదం నూనె తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ బారినపడి విరేచనాల సమస్య మొదలవుతుంది
• ఆముదం నూనెను ప్రతి రోజూ మాడుకు అంటేలా బాగా అంటించటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి తలనొప్పి, కళ్లు మండటం వంటి సమస్యలు తగ్గుతాయి.