Resistant Power: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా.. తప్పకుండా మీకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నట్లే!

Resistat Power: రోగ నిరోధక శక్తి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. కరోనా పాన్డమిక్ వచ్చేవరకు చాలా తక్కువ మందికి దీని పై అవగాహన ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద ధ్యాస పెరిగి ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకుంటున్నారు. మనం తీసుకునే ఆహారం , చేసే పనుల మీద మన రోగనిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది . మీలో కనుక ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీకు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టే.

శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. తరచు జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, చెవి నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇటువంటి సమస్యలు తరచూ వేధిస్తున్నట్లయితే మీలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

సరైన స్థాయిలో రోగ నిరోధక శక్తి లేకుంటే శరీరంలో శక్తి సరిగా లేక ఓపిక లేకుండా అవుతారు. ఆ రోజు మొత్తం అలసటగా ఉండటం వల్ల ఏ పని చేయకుండా రోజు మొత్తం విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఈ లక్షణాలు గనుక మీలో ఉన్నట్లయితే తప్పక డాక్టర్ ను సంప్రదించండి.

ఏవైనా గాయాలు అయినపుడు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వాటితో పోరాడి గాయం త్వరగా తగ్గిపోయేలా చేస్తుంది. అయితే ఇమ్మూనిటీ పవర్ తక్కువ ఉన్న వారిలో గాయాలు అంత త్వరగా మానవు. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వయసుకు తగ్గ బరువు ఉండకుండా క్రమేపీ బరువు తగ్గుతారు.

ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్టయితే వెంటనే మీ రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.