Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా…మీ శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని అర్థం!

Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరగాల్సిందే. వాహనాలకు ఇంధనం ఎంత అవసరమో.. మన శరీరానికి కూడా రక్త ప్రసరణ చాలా అవసరం. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగటం వల్ల ఆక్సిజన్ శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతుంది . శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా వాటి వృత్తి నిర్వహించాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండాలి. రక్త ప్రసరణ విషయంలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మన శరీరంలో రక్తప్రసరణ సరిగా లేదని తెలియజేసే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

మానవ శరీరంలో మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . మెదడులో రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. మెదడులో రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు విపరీతమైన తలనొప్పి , బద్ధకం మతిమరపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి వాటిని తేలికపాటి లక్షణాలుగా తీసుకోకుండా డాక్టర్ నీ సంప్రదించడం మంచిది.

కాళ్లల్లో రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు కాళ్లు వాపులు వస్తాయి . కొంతమందిలో కాళ్ల నొప్పులు , కాళ్ళల్లో స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లల్లో రక్త ప్రసరణ సరిగా లేకపోతే నరాలు పట్టేసి కాళ్ల నొప్పులు వస్తాయి . ఇటువంటి లక్షణాలు కనుక మీలో కనిపిస్తే నీ కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా లేనట్టే .

మన శరీరంలో కిడ్నీలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి . కిడ్నీలలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలకు రక్తం సరిగా సరఫరా అవ్వకపోతే కిడ్నీలో వాపు రావటం , మూత్రం రంగు , మారడం మూత్రం దుర్వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి . ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు జాగ్రత్త పడటం మంచిది . గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇటువంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ నీ సంప్రదించటం శ్రేయస్కరం .