Oral Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త నోటి కేన్సర్ కి దారితీసే ప్రమాదం ఉంది..!

Oral Cancer: ప్రస్తుత కాలంలో తినే ఆహారం, జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరిని ఎక్కువ వేధిస్తున్న సమస్యలు క్యాన్సర్ సమస్యలు కూడా ప్రధానమైనవిగా చెప్పవచ్చుఈ క్యాన్సర్ సమస్య శరీరంలో ఏ అవయవాలకైనా సోకే ప్రమాదం ఉంటుంది. తల భాగంలో వచ్చే క్యాన్సర్ ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ నోరు, పెదాలు, నాలుక, దవడలు, వంటి ఇతర భాగాలలో కూడా వస్తుంది. అయితే క్యాన్సర్ రావటానికి పొగాకు ఉత్పత్తులు కారణమని వైద్య నిపుణులు వెల్లడించారు.

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కి హ్యూమన్ పాపిలోమా వైరస్ (HVP) కూడా ఒక ముఖ్య కారణం. మద్యం సేవించడం, పొగాకు ఉత్పత్తులను తీసుకొనే అలవాటు ఉన్నవారు ఉదయం లేవగానే సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు.
అంటే లెక్క క్యాన్సర్ బారిన పడినప్పుడు కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లక్షణాలు:
• ఈ కేన్సర్ సోకిన వారిలో గొంతు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి మాట్లాడలేక పోతారు.
• ఈ క్యాన్సర్ సమస్య వచ్చినప్పుడు నోటిలో తెలుపు, ఎరుపు కలిసిన మచ్చలు ఏర్పడతాయి.
• ఆహారం తీసుకొనే సమయంలో మింగటానికి ఇబ్బంది పడటం. మాట్లాడటానికి కూడా కష్టంగా మారుతుంది.
• దవడల భాగంలో కనతులు ఏర్పడి నొప్పి రావటం. అధిక తలనొప్పి , చెవి నొప్పి , వినికిడి శక్తి కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సాధారణంగా వేసవికాలంలో ఎటువంటి లక్షణాలతో కూడిన గవదబిళ్లలు సమస్య వస్తుంది. సమస్య తీవ్రత అధికంగా ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం శ్రేయస్కరం. ఈ క్యాన్సర్ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మద్యపానం గుట్కా వంటి పొగాకు ఆధారిత పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. చాలామంది వృద్ధులు తమలపాకు, వక్కపొడి, పొగాకు కలిపి తింటూ ఉంటారు. అటువంటి వారు పొగాకు పొడిని ఎక్కువ సమయం దవడ పక్కన ఉంచుకోవటం వల్ల ఈ క్యాన్సర్ సమస్య తలెత్తుతుంది.

ఉపాధి కోసం చాలామంది పొగాకు, ఆల్కహాల్, చెక్క పొడి, మెటల్ టెక్స్టైల్స్ రంగాల్లో పని చేసే వారికి కూడా ఈ క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పై లక్షణాలను తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవటం వల్ల ఈ ప్రమాదం నుండి బయట పడవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.