Health Tips: ఉదయం టిఫిన్ లో ఈ ఆహారపదార్థాలు తింటున్నారా?? జాగ్రత్త సుమీ..!

Health Tips: మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి అన్ని రకాల పోషక విలువలు అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఉదయం నిద్రలేచిన సమయం నుండి రాత్రి నిద్రపోయే వరకు ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. సమయానుకూలంగా సరైన పద్ధతిలో సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఉదయం లేవగానే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనే విషయం గురించి తెలుసుకుందాం.

సాధారణంగా పనులు చేసుకునేవారు ఉదయం, మధ్యాహ్నం,రాత్రి మూడు పూటలా అన్నం తింటుంటారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం.తెల్ల బియ్యంలో కాలరీలు, షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఇలా తినటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి అధిక బరువు సమస్య, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి ఆహారం తినటానికి కూడా వీలు లేకుండా పోయింది. ఉదయం లేవగానే ఆఫీసులకని పరుగులు పెట్టే వారు టిఫిన్ తినటానికి కూడా సమయం దొరకక ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ సలాడ్ తింటుంటారు.ఇలా ఫ్రూట్ జ్యూస్ తాగడం, ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అపోహ పడుతుంటారు. ఇలా చేయటం వల్ల గతంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. వీటికి బదులు నిమ్మరసం తాగటం వల్ల అందులో ఆంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.

మన భారతదేశంలో ఇడ్లీ వడ పూరి వంటివి టిఫిన్ గా తింటుంటారు. ఉదయం పూట ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి.