Disadvantages Of Fruits: ఇలాంటి పండ్లు తిన్నారా…ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..!

Disadvantages Of Fruits: పండ్లు అంటే అందరికీ ఇష్టమే. ప్రతిరోజు పండ్లు తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరానికి కావలసిన శక్తి అందిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఒక సామెత కూడా ఉంది “రోజు ఒక ఆపిల్ తినండి డాక్టర్ నీ దూరం చేయండి” అని చెబుతారు. బరువు తగ్గాలి అని డైటింగ్ చేసే వారు కూడా వారు తీసుకునే ఆహారం తగ్గించి ఎక్కువగా పండ్లు తింటుంటారు. అయితే పండ్లల్లో చాలా రకాలు ఉన్నాయి, కొన్ని పండ్లు అన్ని సీజన్లలో లభిస్తాయి . కొన్ని మాత్రం సీజన్ లో మాత్రమే దొరుకుతాయి. సీజనల్ పండ్లను తినడం ద్వారా ఆ సీజన్ లో వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. పండ్లలో విటమిన్స్, ప్రొటీన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

ఈ ఆధునిక కాలంలో పండ్ల తినటం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి. పూర్వం మన పెద్దలు 100 ఏళ్ల వరకు ఎటువంటి మందులు వాడకుండా ఆరోగ్యంగా జీవించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అలానే పండ్లు కూడా వాటంతట అవే చెట్టు మీద పండిన పండ్లను తినడం వలన చాలా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. ఇలాంటి పండ్లు ఒక 30 సంవత్సరాల క్రితం వరకు మార్కెట్ లో కూడా అమ్మేవారు. కానీ ఇప్పుడు పంట దిగుబడి పెంచడానికి, పురుగుల నుండి కాపాడుకోవడానికి వివిధ రకాల పురుగుమందులు, రసాయనాలు వాడుతున్నారు. కూరగాయలను కూడా పురుగుమందులు వేసే పెంచుతున్నారు..కాకపోతే వాటిని ఉడకపెట్టిన తర్వాత తింటాం కాబట్టి శరీరానికి ఎక్కువ నష్టం చేయవు.

పండ్లను కూరగాయల లాగా ఉడకబెట్టి తినలేం.. అవి అలానే తింటేనే మంచిది. ఈ రసాయనాలు, యూరియా వేసిన పండ్లు తినడం వల్ల చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరి మీద వాటి ప్రభావం చూపుతాయి. రసాయనాలతో పండించిన పండ్లు తినటం వల్ల ముఖ్యంగా చిన్న పిల్లల తొందరగా జబ్బుల బారిన పడుతున్నారు . మార్కెట్ లో ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా చేసిన పండ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.వీలైనంత వరకు వాటిని తినండం శ్రేయస్కరం. రసాయనాలు వాడిన పండ్లు తినాల్సి వస్తే వాటిని తినడానికి ఒక గంట ముందుగా నీటిలో వేసి తినేముందు బాగా కడిగి తినాలి.