Potatos Side Effects: ఆకుకూరలు కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యానికి అవసరం సరైన పోషకాలు లభించే అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అన్ని రకాల కూరగాయల లో మన ఆరోగ్యానికి అవసరమైన ఏదో ఒక విధమైన పోషక విలువలు కచ్చితంగా కలిగి ఉంటాయి. కానీ కూరగాయలు కూడా సరైన పద్ధతిలో ఉపయోగించటం వల్ల ఆరోగ్యంగా ఉండగలం. సాధారణంగా ప్రతి ఇంట్లో బంగాళదుంపలను కచ్చితంగా వంటకు వినియోగిస్తుంటారు. బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మొలకెత్తిన బంగాళాదుంపలు తినటం చాలా ప్రమాదం. మొలకెత్తిన బంగాళదుంపలను తినటం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంపలు రిఫ్రిజిరేటర్ లో కాకుండా గది ఉష్ణోగ్రతలో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అందువల్ల బంగాళదుంపలు చాలాకాలం నిల్వ ఉండటం వల్ల అవి మొలకలు రావటం తరచూ మనం గమనిస్తూ ఉంటాము. అయితే మొలకెత్తిన బంగాళాదుంపలు తినటం వల్ల ఆరోగ్యానికి హానికరమని అమెరికాకు చెందిన నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ చేసిన పరిశోధనలు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ పరిశోధనల ప్రకారం సాధారణంగా బంగాళా దుంపలలో సోలనిన్, చాకోనిన్ వంటి విష పదార్థాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి, కానీ బంగాళదుంప ఆకులు మొక్కలు వీటి పరిమాణం అధికంగా ఉంటాయి. మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల వాటిలో ఉన్న విష పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలగజేస్తాయి .
మొలకెత్తిన బంగాళదుంపలు తినడం వల్ల కడుపు నొప్పి వాంతులు-విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిలో ఈ లక్షణాలు తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. కొంతమందిలో మాత్రం వీటి తీవ్రత ఎక్కువై తలనొప్పి, జ్వరం వంటి కూడా మొదలవుతాయి. సాధ్యమైనంతవరకు మొలకెత్తిన బంగాళదుంపలను తిరగకపోవడం మంచిది అమెరికాకు చెందిన నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ నివేదిక ప్రకారం డాక్టర్లు సూచిస్తున్నారు.