Health Tips: అరటి, బొప్పాయి కలిపి తింటున్నారా? జాగ్రత్త ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

Health tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలలో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది పండ్లను తినడానికి ఇష్టపడతారు, మరికొందరు ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ మిక్స్ జ్యూస్ తాగడం ఇష్టపడతారు. అయితే ఫ్రూట్ మిక్స్, సలాడ్స్ లో అరటి, బొప్పాయి కలిపి వేసి చేసుంటారు. అరటి పండు తినడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం లభించి శరీర కండరాలు కూడా బలపడతాయి. బొప్పాయి ని రెగ్యులర్ గా తినడం వల్ల కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది.

అయితే అనేకమంది బొప్పాయి మరియు అరటి ని కలిపి తినడానికి సంకోచిస్తుంటారు. బొప్పాయి, అరటి పండ్లను కలిపి తినడం వల్ల మంచిదా??? ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయా?? అనేది చూద్దాం. బొప్పాయి, అరటి పండు కలిపి తినటం వల్ల మనిషి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు లేదా దుష్ప్రభావాలు వారి వారి జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం అరటి పండు, బొప్పాయి రెండు ఒకదానికొకటి విరుద్ధం. వీటిని కలిపి తీసుకోకూడదు అని ఆయుర్వేదం సూచిస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగా లేని వ్యక్తులు వీటిని కలిపి తినడం వల్ల వాంతులు, అజీర్తి, వికారం, గ్యాస్ట్రిక్ వంటి మొదలైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

అరటి, బొప్పాయి కలిపి తినడం వల్ల శ్వాసకోస సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. బొప్పాయి లో ఉండే పాపైన్ అనే పదార్థం జీర్ణ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇవి రెండూ కలిపి తినడం వల్ల గాయాలు త్వరగా మానవు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కామెర్లతో బాధపడేవారు ఈ రెండింటినీ కలిపి అస్సలు తినకూడదు. కొంత మంది శరీరంలో అధిక పొటాషియం తో బాధపడుతూ ఉంటారు, అలాంటి వారు అరటి పండ్లను అస్సలు తినకూడదు. ఫ్లూ, జలుబు సమస్యలు ఉన్నవారు రాత్రివేళ అరటి పండ్లను తినడం మానుకోవాలి.