Side Effects Of Grapes: ఆరోగ్యానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతి రోజూ పండ్లు తినటం వల్ల శరీరం ఎక్కువగా వ్యాధులకు గురికాకుండా ఉంటుంది. శరీర ఆరోగ్యాన్ని కాపాడే పండ్లలో ద్రాక్ష కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ద్రాక్షపండ్లలో చాలా రకాలున్నాయి ఆకుపచ్చ రంగు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, ఎండబెట్టిన ద్రాక్ష అని ఉన్నాయి. ఇవి చూడడానికి సైజు చిన్నగా ఉండటం వల్ల టైం పాస్ చేస్తూ కూడా అనేకమంది ఇష్టంగా తింటారు. ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం.. అమితంగా తింటే అనారోగ్యం అని అందరికీ తెలిసిన విషయమే. ద్రాక్ష కూడా ఈ కోవకు చెందినదే… ద్రాక్ష ఎక్కువగా తింటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ద్రాక్షలో తీపి ఎక్కువగా ఉంటుంది. కడుపు నొప్పి కి సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష ను అధిక మోతాదులో తినకపోవడం ఎంతో మంచిది. ద్రాక్ష ను అధికంగా తినడం వల్ల విరేచనాల సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. ద్రాక్షలో ప్రోటీన్లు, కొవ్వు, కాపర్, థయామిన్ ఫైబర్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ద్రాక్షను ఎక్కువగా తినకూడదు. ద్రాక్షలో కేలరీల పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు పెంచడంలో ఇవి తోడ్పడతాయి. గర్భధారణ సమయంలో మహిళలు ద్రాక్ష ని తినాలనుకుంటే ఒకసారి వైద్యుని సలహా తీసుకోవడం ఎంతైనా మంచిది. గర్భిణీలు ద్రాక్ష ను ఎక్కువగా తినడం వల్ల ద్రాక్షలో ఉండే పాలీఫెనాల్స్, పుట్టబోయే బిడ్డలో ప్యాంక్రియాటిక్ సమస్యలు కలగజేస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ద్రాక్ష ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే తీపి రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీంతో మధుమేహం పెరిగి మూత్రపిండాల వ్యాధి బారిన పడాల్సి వస్తుంది. ద్రాక్ష ఎక్కువగా తినడం వల్ల కొద్దిమందిలో అలర్జీలకు దారితీస్తుంది. ద్రాక్ష ఎక్కువగా తింటే చర్మం మీద దద్దుర్లు, దురద, నోటి వాపు వంటి సమస్యలు వస్తాయి. ద్రాక్ష పళ్ళు తినాలి అనుకున్నవారు టేస్ట్ బాగా తీయతీయగా పుల్లపుల్లగా ఉన్నాయని ఎక్కువ మోతాదులో తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మీ చుట్టుముడతాయి. ద్రాక్ష తినాలి అనుకున్న వారు తగు జాగ్రత్తలు పాటించి తినడం ఎంతో శ్రేయస్కరం.