వేడి నీళ్లు మంచిదని ఎక్కువ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదం తప్పదు!

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మన శరీరానికి ఆహారం తీసుకోవటం ఎంత అవసరమో నీళ్లు తాగటం కూడా ఆరోగ్యానికి అంతే అవసరం. రోజుకు 7 నుండి 8 లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు మన శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడి శరీరంలోని పదార్థాలను చెమట రూపంలో బయటికి వచ్చే లాగా చేస్తుంది.కానీ ప్రస్తుతం వస్తున్న అనారోగ్య సమస్యలకు వేడినీరు తాగటం చాలా అవసరం. ప్రతిరోజు వేడినీరు తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అలా అని చాలా వేడి వేడి నీరు తాగటం ప్రమాదకరం. ప్రతిరోజు ఉదయం రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీటిని నిదానంగా నోటిలో ఉంచుకొని తాగటం ఆరోగ్యానికి మంచిది.

వేడి నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల ఆరోగ్యానికి మంచిదని అనుకుంటే పొరపాటే. కొన్ని సందర్భాలలో వేడినీరు తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేడినీరు తాగటం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం….చాలామంది రాత్రి నిద్రపోయే ముందు పాలకి బదులు వేడి నీళ్లు తాగుతూ ఉంటారు. అలాచేయటం వల్ల నిద్ర సరిగా పట్టకపోవటం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాగే మూత్ర విసర్జన సమస్యలు కూడా తలెత్తుతాయి. వేడి నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

వేడినీరు ఎక్కువగా తాగటం వల్ల మెదడులోని నరాలలో రక్త ప్రసరణ సరిగా జరగదు. అందువలన నెర్వస్ సిస్టం వాపు వచ్చె ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వేడినీరు తాగటం చాలా ప్రమాదం. వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అనుకొని భ్రమ పడకండి. వేడి నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయో అని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కనుక మరీ పోవడమే కాకుండా గోరువెచ్చగా తాగడం ఉత్తమం.