Paper cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా.. అయితే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..!

Paper cups: మారుతున్న మన ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . చాలా మందికి రోజుకి 3 ,4 సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది . ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లో పని చేసేవారు నిద్ర రాకుండా ఉండటానికి టీ తాగటం చాలా అవసరం . అయితే ఇంట్లో లాగా ఆఫీసులో , కాఫీ షాప్ లో స్టీల్ గ్లాస్ ,కప్స్ కి బదులు పేపర్ కప్స్ వాడుతుంటారు . ప్లాస్టిక్ కప్పులు ఆరోగ్యానికి ప్రమాదమని ప్లాస్టిక్ వాడకం నిషేధించారు . ఇప్పుడు అందరూ టీ తాగడానికి పేపర్ కప్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ పేపర్ కప్ లో టీ , కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం .

ఖరగపూర్ ఐఐటీ లో చేసిన పరిశోధనల్లో పేపర్ కప్ లో టీ తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు వెల్లడించారు . సాధారణంగా పేపర్ కప్ నీ ధర్మకోల్ తో తయారు చేసేవారు.. కానీ ఇప్పుడు చాలామంది థర్మాకోల్ బదులుగా పాలియస్టర్ అనే ఒక రకమైన ప్లాస్టిక్‌ ఉపయోగించి పేపర్ కప్ తయారు చేస్తున్నారు . ఈ కప్పులలో వేడి వేడి పదార్థాలు పోయగానే వాటిలో ఉండే ప్లాస్టిక్ కణాలు కరిగిపోయి టీ ,కాఫీలో కలిసిపోతాయి. ఇలాంటి కాఫీ, టీ తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

డిస్పోజల్ పేపర్ కప్పులో వేడి వేడి 100 మి.లీ టీ కాఫీ తాగడం వల్ల75 వేల అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మనం తాగే టీ , కాఫీలో కలిసి శరీరం లోకి ప్రవేశిస్తాయి. ఇలా పేపర్ కప్పులో టీ కాఫీ తాగడం వల్ల క్రమంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా కేన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది.

పేపర్ కప్పుల లో టీ , కాఫీ తాగడం వల్ల క్రోమియం, బియ్యం బియ్యం కాడ్మియం వంటి హానికర హానికర లోహాలు శరీరంలోకి ప్రవేశించి అనేక ఆరోగ్య సమస్యలకు కు దారి తీస్తాయి. పేపర్ కప్పుల లో టీ తాగడం వల్ల క్యాన్సర్ , హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, తరుచుగా అలసట చెందడం, చర్మ సంబంధిత రోగాలు లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి . పేపర్ కప్పులలో తేలికైన ప్లాస్టిక్ లో డెన్సిటీ పాలిథిన్ ఉండటం వల్ల వాటిని రీసైక్లింగ్ చేయటానికి కూడా కష్టమవుతోంది . అందువల్ల పేపర్ కప్పులు బదులు సాధ్యమైనంతవరకు స్టీల్ కప్పులు , గాజు కప్పులలో తాగడం మంచిది.