Health Tips: ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆహార పద్ధతుల్లో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల చిన్న పిల్లలకు కూడా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసి ప్రతిరోజు తగిన మోతాదులో నీటిని తాగటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రతిరోజు గోరువెచ్చని నీటిని ఎంత పరిమాణంలో తాగాలి?ఆ నీటిని తాగటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా శీతాకాలం వేసవి కాలం అంటూ తేడా లేకుండా తరచూ ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యలు జలుబు, దగ్గు వంటి సమస్యలు అధికం. ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గటమే కాకుండా సైనస్ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా మంచి ఫలితం ఉంటుంది.

ప్రతిరోజు ఉదయం గోరు వెచ్చని నీటిలో కొంచెం తేనె నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గటమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించి అధిక బరువు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ప్రతి రోజు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.

బెంగళూరులోని బన్నెరఘట్ట రోడ్‌లోని ఫోర్టిస్‌ ఆస్పత్రి చీఫ్‌ డైటీషియన్‌ షాలినీ అవిరంద్‌ మాట్లాడుతూ వేసవి కాలం శీతాకాలం అనే తేడా లేకుండా ఈ ఏడాది పొడవునా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆయన వెల్లడించారు.