Weight Loss Tips:ఈ కంప్యూటర్ యుగంలో అధిక బరువు సమస్యలు సర్వ సాధారణం అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా శారీరక బరువు విపరీతంగా పెరిగి పోతున్నారు. బరువు పెరిగినంత సులువుగా తగ్గడం సాధ్యపడదు. గంటల తరబడి కంప్యూటర్లముందు కూర్చుని పని చేయడం, టైంకి ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం శరీర బరువు పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు వారి వారి శరీర పరిస్థితిని బట్టి మార్పులు ఉంటాయి. ఈ కాలంలో బరువు ఎంత సులువుగా పెరుగుతున్నారో దానిని కంట్రోల్లో ఉంచడానికి కూడా అంతే కష్టపడుతూ దానికోసం సరైన మార్గాలను అన్వేషిస్తుంటారు. డైటింగ్లు, ఎక్సర్సైజులు ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
అయితే చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇవి సరైన ఎక్స్పర్ట్ సలహాలు లేకుండా తమకు తోచిన విధంగా చేస్తుంటారు. నిజానికి వ్యాయమాలు ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం. వ్యాయామాలు చేసే సమయంలో ఏదైనా తప్పు దొర్లితే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కొంతమంది జిమ్ లో జాయిన్ అయ్యి జిమ్ ట్రైనర్ ద్వారా తగిన పద్ధతిలో వ్యాయామాలు చేస్తుంటారు. వ్యాయామాలు చేయడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే వ్యాయామాలు ఇష్టానుసారం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని చేస్తూ చేస్తూ మధ్యలో ఆపి వేయడం వలన కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Crunches: క్రంచెస్ చేయడం వల్ల మీ పొత్తికడుపు కింద ఉన్న కండరాలు బలపడతాయి. క్రంచెస్ అబ్స్ నిర్మించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి నేలపై పడుకొని చేయడం వలన మీ వెన్ను పూస మీద భారం పడి వెన్ను నొప్పి సమస్యలు, బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
Behind the head lat pull down: ఈ వ్యాయామం చేసేటపుడు మెడ వెనుక భాగాన ఉన్న బరువు తగ్గటం వలన భుజాలు, వెన్నెముక మీద ప్రభావం చూపవచ్చు. ఈ వ్యాయామం శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ వ్యాయామం చేసేటప్పుడు నిపుణుల సూచనల మేరకు చేయడం ఎంతో ముఖ్యం. బరువును లాగేటప్పుడు చాలామంది తలను ముందుకు వంచి లాగుతూ ఉంటారు, తద్వారా మేడ మీద ఎక్కువ ప్రెషర్ పడి అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు.
Leg extension machine: ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త గా ఉండడం అవసరం. ఈ వ్యాయామం ద్వారా మీ క్వాడ్ కండరాలు బలంగా తయారవుతాయి. ఈ వ్యాయామం చేసేటప్పుడు మీరు ఒక మోకాళ్ళ పైన అధిక ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఫ్యూచర్ లో మీరు అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.
Smith machine squats: కండరాలు ఎంతో ఫిట్ గా ఉండేందుకు ఇవి ఉపయోగపడుతుంది. బార్ బెల్ లేకుండా ఈ వ్యాయామాలను చేస్తే, మీ మోకాళ్ళమీద అధిక ఒత్తిడి కలిగి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామాలు చేయడం శరీరానికి ఎంతో అవసరం. కానీ వాటిని నిపుణుల సూచనల మేరకు చేయడం ద్వారా అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు.