సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆయన ఆరాధన సకల శుభాలను కలిగిస్తుంది. ఆయనన్ను ఆరాధించడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించడమే. ఆయన కిరణాలు తగిలితే చాలు దేహంలో అనేక మంచి ఫలితాలు వస్తాయని పూర్వం నుంచి శాస్త్రాలు చెప్తున్నాయి. నేడు అదే నిరూపణ అయ్యింది. కాశీఖండంలో చెప్పిన సూర్యస్తుతిని, ఆరాధించే పద్ధతి, నామాలు తెలుసుకుందాం…
కింద చెప్పిన 70 నామాలను ఉచ్చరిస్తూ.. సూర్యభగవానుని ఎదుట అంటే ఎండలో ఉదయం పూట అవకాశం ఉంటే మోకాళ్లపై నిలబడి రెండు చేతులతో రాగిపాత్రను పట్టుకుని ఆ పాత్రను నీటితో నింపి గన్నేరు, ఎర్రని పూలు, ఎర్ర చందనం, గరిక, అక్షతలు వేసి ఆ పాత్రను నొసటకు ఎదురుగా ఉంచుకుని సూర్యునికి అర్ఘ్యం వదలాలి. ఆ నామాలు…
ఓం హంసాయ నమః
ఓం భానవే నమః
ఓం సహశ్రాంశవే నమః
ఓం తపనాయ నమః
ఓం తాపనాయ నమః
ఓం రవయే నమః
ఓం వికర్తనాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం విశ్వ కర్మణే నమః
ఓం విభావసవే నమః
ఓం విశ్వ రూపాయ నమః
ఓం విశ్వ కర్త్రే నమః
ఓం మార్తాండాయ నమః
ఓం మిహిరాయ నమః
ఓం అంశు మతే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఉష్ణగవే నమః
ఓం సూర్యాయ నమః
ఓం ఆర్యంణే నమః
ఓం బ్రద్నాయ నమః
ఓం దివాకరాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం సప్తహయాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం అహస్కరాయ నమః
ఓం ఖగాయ నమః
ఓం సూరాయ నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం లోక చక్షుషే నమః
ఓం గ్రహేస్వరాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం లోక సాక్షిణే నమః
ఓం తమోరయే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శుచయే నమః
ఓం గభస్తి హస్తాయ నమః
ఓం తీవ్రాంశయే నమః
ఓం తరణయే నమః
ఓం సుమహసే నమః
ఓం అరణయే నమః
ఓం ద్యుమణయే నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం అర్కాయ నమః
ఓం భానుమతే నమః
ఓం భయ నాశనాయ నమః
ఓం చందోశ్వాయ నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం భాస్వతే నమః
ఓం పూష్ణే నమః
ఓం వృషా కపయే నమః
ఓం ఏక చక్ర ధరాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం మందేహారయే నమః
ఓం తమిస్రఘ్నే నమః
ఓం దైత్యఘ్నే నమః
ఓం పాప హర్త్రే నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మ ప్రకాశకాయ నమః
ఓం హేలికాయ నమః
ఓం చిత్ర భానవే నమః
ఓం కలిఘ్నాయ నమః
ఓం తాక్ష్య వాహనాయ నమః
ఓం దిక్పతయే నమః
ఓం పద్మినీ నాధాయ నమః
ఓం కుశేశయ నమః
ఓం హరయే నమః
ఓం ఘర్మ రశ్మయే నమః
ఓం దుర్నిరీక్ష్యాయ నమః
ఓం చండాశవే నమః
ఓం కశ్యపాత్మజాయ నమః
పై 70 నామాలను శ్రద్ధతో పైన చెప్పిన విధంగా ఉచ్చరించి అర్ఘ్యం వదిలినవారికి దరిద్రం పోతుంది. దుఃఖములు పోతాయి. భయంకర వ్యాధుల నుంచి విముక్తి, మరణానంతరం సూర్యలోక ప్రాప్తి జరగుతుందని కాశీఖండంలో తొమ్మిదో అధ్యాయంలో ఉంది.
కరొనా సమయంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దీనికి డీ విటమిన్ చాలా అవసరం. మన శాస్త్రం చెప్పినది, నేడు సైన్స్ చెప్తున్నది ఒక్కటే. కాబట్టి ఎటువంటి ఖర్చులేని ఈ పనిని సూర్యోదయ సమయంలో చేయండి. మరీ ముఖ్యంగా ఆదివారం చేస్తే ఇంకా మంచిది.