సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయటానికి గల ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజులపాటు జరుపుకొని ఈ పండుగ జరుపుకోవాలని దేశ విదేశాలలో ఉండే ప్రజలందరూ తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులతో పువ్వులతో ఇంటి లోగిలను అలంకరించి రకరకాల పిండి వంటలు తయారు చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజున కోడి పందాలు, గంగిరెద్దుల కోలాహలం, హరిదాసు గీతాలు గాలిపటాలు ఎగురవేయటం చాలా ప్రత్యేకం.

ఇక సంక్రాంతి పండుగ రాకముందే ప్రజలందరూ గాలిపటాలు ఎగరవేస్తూ ఉంటారు. అయితే ఇలా సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలు ఎగురవేయటానికే గల కారణం ఏమిటి? దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందువల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అని అంటారు. సంక్రాంతి రోజుతో చలికాలం పూర్తి అయ్యి వసంతకాలం మొదలవుతుంది. ఇలా వసంత కాలానికి ఆహ్వానం పలకడం కోసం ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయటం ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది.

అంతేకాకుండా ఇలా గాలిపటాలు ఎగరవేయటానికి శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. సంక్రాంతి పండుగతో శీతాకాలం పూర్తి అవటం వల్ల ఆ రోజున ఉదయం నుండి గాలిపటాలు ఎగరవేయడానికి
సూర్యరష్మి మనపై పడేలా ఉండటంవల్ల ఆ సూర్యలక్ష్మి వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం ఆరు నెలల తర్వాత దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని, అందుకు సూచనగా సంక్రాంతి పండుగ రోజున ఆకాశంలోకి గాలిపటాలు ఎగురవేస్తూ దేవతలకు కృతజ్ఞతలు తెలిపే మార్గం అని కూడా భావిస్తారు.