డయాబెటిస్ సమస్య ఉన్న వారు పైనాపిల్ తింటున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు. నూటిలో డెబ్బై శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిని వేధిస్తున్న ఈ సమస్యను నియంత్రించకపోతే దాని ప్రభావం శరీర అవయవాల మీద చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే డయాబెటిస్ ని నియంత్రించటానికి తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయి పెరిగి డయాబెటిస్ వ్యాధిని అధికం చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్ లు ఏ ఏ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటిస్ పేషెంట్లు మాత్రం కొన్ని పనులకు దూరంగా ఉండటం మంచిది. అలా డయాబెటిస్ పేషెంట్లు ముఖ్యంగా పైనాపిల్ కి దూరంగా ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్-ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ డాక్టర్ రాజీవ్ గుప్తా సూచిస్తున్నారు. డాక్టర్ రాజీవ్ గుప్తా సూచనల ప్రకారం డయాబెటిస్తో బాధపడేవారు రోజుకు 100 గ్రాములకు మించి పైనాపిల్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయి వేగంగా పెరుగుతుందని ఆయన సూచించాడు. పైనాపిల్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ 51 నుండి 73 వరకు ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు రోజులో 100 గ్రాముల కంటే ఎక్కువ పైనాపిల్ తినకూడదు.

అయితే పైనాపిల్ వల్ల షుగర్ పేషెంట్లకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లు ప్రతిరోజు 100 గ్రాముల పైనాపిల్ తినటం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పైనాపిల్ ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోనే చక్కర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.