Mangala Soothram: మంగళ సూత్రం ధరించడం సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు!

Mangala Soothram: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇలా మంగళ సూత్రం పెళ్లి అయిన ప్రతి ఒక్క మహిళ మెడలో తప్పనిసరిగా ఉంటుంది. వివాహ సమయంలో వరుడు మంగళసూత్రాన్ని మూడుముళ్ల బంధంతో వివాహిత మెడలో వేస్తారు. ఇలా వివాహం తరువాత భార్య మెడలో ఉన్న మంగళసూత్రం తిరిగి తన భర్త మరణించే వరకు తన మెడలో ఉంటుంది. ఇలా తాళిని భర్త స్వరూపంగా భావించి ఆ ఇల్లాలు ఎంతో గౌరవంగా చూసుకుంటుంది.

అయితే మంగళసూత్రం ధరించే సమయంలో చాలామంది ఎన్నో రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంగళ సూత్రం ధరించినప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయానికి వస్తే… సాధారణంగా మంగళసూత్రం ధరించేవారు మంగళసూత్రంతో పాటు నలుపు ఎరుపు పూసలు, అలాగే బంగారు పూసలతో పాటు కలిపి మెడలో వేసుకుంటారు.ఇలా నల్లపూసలు పరమేశ్వరుడికి ప్రతీకగా ఉంటే బంగారు వర్ణం పూసలను పార్వతి దేవి గా పరిగణిస్తారు. ఇలా నలుపు బంగారు పూసలను కలిపి ఇస్తే వారికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లవేళలా దీర్ఘ సుమంగళిగా ఉంటారని చెబుతారు.

ఇలా మంగళసూత్రం మెడలో వేసుకున్న తర్వాత చాలామంది మంగళసూత్రంతో పాటు వారి ఇష్టదైవాలను కూడా మంగళసూత్రంలో వేసుకుంటారు. అయితే ఇలా చేయడం చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మనకు మనమే కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా మంగళసూత్రంలో లక్ష్మీదేవి ప్రతిమ అసలు ఉండకూడదు అని చెబుతారు. ఇలా లక్ష్మీ దేవి ప్రతిమ ఉండటంవల్ల మన ఇంట్లో సిరి సంపదలు ఉండవని పండితులు చెబుతున్నారు. అందుకోసమే పొరపాటున కూడా మంగళసూత్రం వేసుకునే సమయంలో ఈ తప్పులు చేయకండి.