Health Tips: వేసవికాలంలో శరీరం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయా ? ఈ పద్ధతుల ద్వారా వేడి తగ్గించవచ్చు…!

Health Tips: ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తోంది.వేసవి కాలంలో వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి డీహైడ్రేషన్ కి గురవుతుంది. శరీరం డీహైడ్రేషన్ అవటం వల్ల తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేసవికాలంలో శరీరంలోని అధిక ఉష్ణోగ్రత ను తగ్గించడానికి మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో కొన్ని మార్పులు చేయటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా వేసవి కాలంలో వేడికి మన ఒంట్లో ఉన్న మీరంతా చెమట రూపంలో బయటికి పోతుంది. అందువల్ల వేసవికాలంలో మీరు ఎక్కువ మోతాదులో తాగటం మంచిది. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందువల్ల వేసవికాలంలోఎల్లప్పుడు గాలి బాగా వీచే ప్రదేశంలో ఉంటూ పని చేసే సమయంలో ఒకే దగ్గర ఎక్కువ సమయం కూర్చోకుండా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉండాలి.

శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ అయినప్పుడు ఛాతి, మణికట్టు మీద చల్లని నీటితో కాని, ఐస్ క్యూబ్స్ తో కానీ తాడుపుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని చల్లబరచడానికి పండ్లతో తయారు చేసిన జ్యూస్ లను, మజ్జిగ తరచూ తాగుతూ ఉండాలి.

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒక టీస్పూన్ మెంతుల్ని దోరగా వేయించి వాటిని పొడి చేసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది.