చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే వాటిలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పటంలో సందేహం లేదు. పాలల్లో ఎన్నో పోషక విలువలు, విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. పాలలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. రోజు పాలు తాగటం వల్ల శరీరంలోని ఎముకలకు కావలసిన క్యాల్షియం లభించి దృఢంగా ఉంటాయి. కానీ ఆవు పాలు, గేదె పాలు మధ్య తేడాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
ఆవు పాలు, గేదె పాలు చూడటానికి ఒకే రకంగా ఉండవు. గేదె పాలు తెలుపు రంగులో,ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. ఆవుపాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. గేదె పాలలో 7 నుండి 8 వరకు కొవ్వు శాతం ఉంటుంది. చాలామంది ఆవు పాలు మాత్రమే ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. గేదె పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి వేడిని నిరోధించే శక్తి కలిగి ఉంటాయి.
ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల తొందరగా జీర్ణమవుతాయి. గేదె పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువలన చిన్న పిల్లలకు, ముసలి వారికి గేదె పాలలో కొన్ని నీటిని కలిపి తాపితే తొందరగా జీర్ణం అవుతాయి.ఆవు పాలతో పోలిస్తే బర్రె పాలలో పెరాక్సిడేస్ అనే ఎంజాయ్ ఎక్కువగా ఉండటం వల్ల బర్రె పాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆవు పాలు పిండిన రెండు రోజులలోపే వాడుకోవటం మంచిది. పాలు తాగటం వల్ల తలనొప్పి, క్యాన్సర్, ఒబిసిటీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ప్రతిరోజు పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషకాలు అంది కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు నుండి విముక్తి పొందవచ్చు. పాలు బాడీలోని ఎసిడిటీ లెవెల్స్ తగ్గిస్తాయి.