కేటీ‌ఆర్ పట్టాభిషేకానికి అడ్డం ఉన్న ఒకే ఒక్క పాయింట్ ఇదే

తెరాస పార్టీలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ కేటీఆర్ పట్టాభిషేకం.  గత రెండేళ్లుగా ఈ విషయం ప్రస్తావనకు వస్తూనే ఉన్నా గత రెండు వారాలుగా మాత్రం మరీ గట్టిగా వినిపిస్తోంది.   ఈసారి కేటీఆర్ సీఎం అయిపోవడం ఖాయమని అంటున్నారు.  పార్టీలో ముఖ్య నేత ఆయిన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆరే మా దగ్గర అన్ని పనులు చూసుకుంటున్నారు, ఆయన సీఎం అయితే మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అన్నారు.  మరొక ముఖ్య నేత, కేసీఆర్ కు అత్యంత దగ్గర సన్నిహితుడు అయిన పద్మారావు కూడ కేటీఆర్ పట్టాభిషేకం గురించి క్లియర్ పిక్చర్ ఇచ్చేశారు. 
 
Date Fixed For Ktr To Take Charges As Cm
Date fixed for KTR to take charges as CM
పద్మారావు చెప్పిన మాటల మేరకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రారంభిత్సవం జరిగిన వెంటనే కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.  యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  భారీ వ్యయంతో రాష్ట్రానికే తలమానికం అనేలా రూపుదిద్దుతున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ ఆలయాన్ని కూడ అలాగే భావిస్తున్నారు కేసీఆర్.  ఒక్క మాటలో చెప్పాలంటే ఆలయం ప్రారంభోత్సవం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఆయన.  
 
గతేడాదిలోనే ప్రారంభించాలని అనుకున్న వివిధ కారణాల వలను వాయిదా వేసి ఈ ఫిబ్రవరికి ఫైనల్ చేశారు.  త్వరలో కేసీఆర్ చినజీయర్ స్వామిని కలిసి ప్రారంభోత్సవం ముహూర్తం పెట్టించనున్నారట.  ఇక ఆ ముహూర్తాన్నే కేసీటీఆర్ పట్టాభిషేకం ముహూర్తం అని కూడ అనుకోవచ్చు.  మొత్తానికి రాష్ట్ర ప్రజలు యాదాద్రి ప్రారంభం కోసం వేచి చూస్తుంటే కేటీఆర్ అభిమానులు, పార్టీ నేతలు  మాత్రం ఆయన సీఎం పీఠం మీద కూర్చునే తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles