Health Tips: గత రెండు సంవత్సరాల క్రితం దేశంలో విజృంభించిన కరోనా కలకలం సృష్టించింది. చాపకింద నీరులా వ్యాపించి ప్రపంచదేశాలను గడగడ వణికించింది. ఒక్కో వేవ్ లో ఒక్కోరకంగా రూపాంతరం చెంది కొత్త వేరియంట్ల రూపంలో ప్రజల మీద దాడి చేసింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో అధిక ప్రాణ నష్టం వాటిల్లింది. థర్డ్ వేవ్ లో కరోనా ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపించిన కూడా ప్రాణ నష్టం ఎక్కువ లేకపోవడం కొంత ఊరటనిచ్చింది.తాజాగా జరిగిన పరిశోధనలలో కరోనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పరిశోధకులు వెల్లడించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మాస్కులు ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కానీ మనం ప్రతి రోజూ ఉపయోగించే మౌత్ వాష్ వల్ల కరోనా ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే అరికట్టవచ్చు అని తాజాగా చేసిన పరిశోధనలలో వెల్లడైంది.కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనా వైరస్ పై చేసిన పరిశోధనలలో మనకు అందుబాటులో ఉండే కొన్ని రకాల మౌత్ వాష్ కరోనా అంతం చేయవచ్చని తేలింది.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా సిపిఎస్ ఆధారిత మౌత్ వాష్ కరోనా అంతం చేయడానికి పనిచేస్తున్నాయని తేలింది.కొన్ని రకాల మౌత్ వాష్ లను ల్యాబ్ లో ప్రయోగించడం ద్వారా కరోనా వైరస్ పూర్తిగా అంతం అయినట్టు వారు తెలియజేశారు. శరీరంలో వైరస్ స్థాయిలను తగ్గించడానికి సీపీసీ ఆధారిత మౌత్ వాష్ లు బాగా పని చేస్తాయని వారు పేర్కొంటున్నారు. కాకపోతే ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడ ప్రచురించలేదు. పూర్తి వివరాల ప్రచురణ కోసం జర్నల్ పంపుతామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.