దేవుడా.. ఇటువంటి విపత్తు ఇంకోసారి రావద్దు అని ప్రపంచమంతా దేవుడిని వేడుకుంటోంది. ఇది మామూలు మహమ్మారి కాదు. ఎవరూ ఊహించనిది. కరోనా వస్తుందని… ఇలా ప్రపంచమంతా ఒక్కసారిగా తలకిందులు అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కలలో కూడా ఇటువంటి విపత్తును ఊహించలేదు. కానీ.. ఈ మాయదారి కరోనా ప్రపంచాన్ని నాశనం చేసింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.
ఘోరమైన విపత్తు ప్రపంచంపై దాడి చేసినా.. ప్రపంచమంతా ఏకతాటిమీద నడిచి.. దాన్ని ఎదుర్కోగలుగుతోంది. ఇప్పుడిప్పుడే దానికి వాక్సిన్ కూడా వస్తోంది. త్వరలోనే ఈ కరోనా విపత్తు నుంచి ప్రపంచం బయటపడుతుంది. కానీ.. అప్పటి వరకు కరోనాతో పోరాడేవాళ్ల బాధలే వర్ణణాతీతం.
ఇక.. అసలు టాపిక్ లోకి వెళ్తే… కరోనా కారణంగా చనిపోయిన వారి పోస్ట్ మార్టమ్ నివేదికల్లో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయట. కరోనాతో చనిపోయిన వారి అవయవాలను పరిశీలించిన డాక్టర్లు షాక్ కు గురయ్యారు.
వాళ్ల లంగ్స్, కిడ్నీలు, రక్తాన్ని పరిశీలిస్తే… లంగ్స్ లో గాయాలు అయినట్టు… రక్తం గడ్డకట్టుకుపోయినట్టుగా కనిపించిందట. అంతే కాదు.. కిడ్నీల్లోనూ గాయాలు కనిపించాయట. అంటే.. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక… డైరెక్ట్ గా ఊపిరితిత్తులను, కిడ్నీలను అటాక్ చేస్తుంది. దాని వల్లనే కిడ్నీల్లో, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడుతున్నాయి.
ఈ నివేదికను ఇటీవలే లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. దీన్ని బట్టి.. ఈ పరిశోధన ద్వారా కరోనా వచ్చిన వాళ్లను ఇంకా మంచి వైద్యం అందించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించగానే ఊపిరితిత్తులను, కిడ్నీలను అటాక్ చేయకుండా అడ్డుకోగలిగితే.. కరోనా వల్ల మృతి చెందే వాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
రక్తం గడ్డకట్టకుండా బ్లడ్ తిన్నర్ ను ఉపయోగించవచ్చని.. అలాగే.. ఊపిరితిత్తులు, కిడ్నీలకు సంబంధించి సాధారణంగా చేసే చికిత్సను చేయవచ్చని.. దీనిపై ఇంకాస్త పరిశోధన చేస్తే కరోనా మరణాలను తగ్గించవచ్చని వాళ్లు చెబుతున్నారు.
ఒకవేళ పరిశోధకుల స్టడీ ప్రకారం.. కిడ్నీ, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం కోసం వాడే మందులను ఉపయోగించి.. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు బ్లడ్ తిన్నర్ వాడితే కరోనా వచ్చినా వాళ్ల ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కరోనాను శరీరం నుంచి తరిమికొట్టగలిగితే వాళ్లు ప్రాణాలతో బయటపడ్డట్టే. చూద్దాం.. వీళ్ల స్టడీ ఎప్పుడు ఫలితం ఇస్తుందో?