Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా లండన్ లో ల్యాండ్ అయ్యారు. ఇటీవల ఈయనకు యూకే ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఈ అవార్డును ఈ నెల 19వ తేదీ అందచేయబోతున్న నేపథ్యంలో చిరంజీవి లండన్ వెళ్లారు. సినిమా ఇండస్ట్రీలోను అలాగే సేవారంగంలో ఈయన అందించిన సేవలను గుర్తించిన యూకే ప్రభుత్వం ఈయనకు ఈ అవార్డును ప్రకటించారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నారు.
ఈ విధంగా చిరంజీవి లండన్ వెళ్లడంతో అక్కడ అభిమానులు చిరంజీవిని చూడటం కోసం తరలివచ్చారు. ఈ క్రమంలోని కొంతమంది అభిమానులు ఏకంగా ఆయనకు ముద్దులు పెడుతూ ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక యూకే పార్లమెంటులో ఈయన ఈ అవార్డు అందుకోబోతున్నారు.
ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు. మరోవైపు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవికి ఎన్నో పురస్కారాలు అవార్డులు వచ్చాయి. ఇటీవల ఈయన పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా చిరంజీవి మరొక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకోబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.