కరోనా రోగి అంటేనే ఆమడ దూరం పరిగెత్తే పరిస్థితి. అసలిప్పుడు ఆ రోగం పెరెత్తితే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు లైట్ తీసుకున్న జనాలు ఇప్పుడు అదే కరోనా పేరు చెబితే గజగజలాడిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. అందులోనూ తెలంగాణలోని హైదరాబాద్ జీహెచ్ ఎంసీలో కేసులు..మరణాల సంఖ్య పెరగడంతో పాటు సరైన వైద్యం అందకపోవ డం అంతకుమించి భయానికి గురి చేస్తోంది. ఇప్పటికే సీటీ చాలా వరకూ ఖాళీ అయిపోయింది. అద్దె..సొంత ఇళ్లు అనే తేడా లేకుండా అందరూ సిటీకి దూరంగా పరుగులు తీస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముగ్గురు కరోనా అని తమకి తెలిసి కూడా ఆర్టీసీ బస్సెక్కి ధీమాగా మాకు కరోనా ఉంది…చికిత్స చేయండి అంటూ ఆసుపత్రికి వెళ్లడం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే…
శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు టీఎస్ 08 జెడ్ 0229 అనూ సూపర్ లగ్జరీ బస్సు జేబీఎస్ బస్టాండ్ నుంచి అదిలాబాద్ కు బయలు దేరింది. అందులో ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కే ముందు ఓ ప్రయివేట్ ల్యాబ్ లో కరోనా పరీక్షలు చేయించుకు న్నారు. రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. అయినా ఆ దుర్మార్గులు ఎంత మాత్రం బాధ్యత తీసుకోకుండా జేబీఎస్ లో బస్సెక్కి అదిలాబాద్ వరకూ ప్రయాణించారు. రాత్రి 10.30 గంటలకు బస్సు అదిలాబాద్ కే చేరింది. అనంతరం ఆ ముగ్గురు బస్సు దిగి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తమకి కరోనా ఉందని..వైద్యం చేయాలని కోరారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది బెంబేలెత్తిపోయింది.
వెంటనే వాళ్లను ఐసోలేషన్ కు తలరించి చికిత్స మొదలు పెట్టారు. అయితే ఈ విషయం టీఎస్ ఆర్ టీసికి తెలియడం తో ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ బస్సు తిరుగు ప్రయాణం చేసిందా? చేస్తే ఎంత మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు? ప‌్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి? అన్న దానిపై ఆందోళన నెలకొంది. బస్సులో ప్రయాణించిన ఎంత మందికి ఆ ముగ్గురు దుర్మార్గులు రోగాన్ని అంటిచారోనని! భయపడిపోతున్నారు ప్రయాణికులు. అలాగే ఆ ముగ్గురు సిటీలో ఎక్కడెక్క తిరిగారో ఇంకా కానరాలేదు.