ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఏ పని మొదలుపెట్టినా విజయం.. ఆలయం ఎక్కడంటే?

మనలో చాలామంది దేవుడిని ఎంతో విశ్వసిస్తారు. గ్రామ దేవతలను పూజించే ఆచారం ఇప్పటికీ దేశంలోని చాలా గ్రామాలలో ఉంది. అయితే కొన్ని ఆలయాలను దర్శించుకుంటే కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. అదిలాబాద్ జిల్లాలో ఉన్న మహాలక్ష్మి ఆలయం దర్శించుకోవడం ద్వారా కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరతాయి. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

ఈ ఆలయంలో వేర్వేరు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలో జులై నెల సమయంలో భోనాలు, దసరా పండుగ సమయంలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఈ ఆలయంలో దుర్గామాత, సరస్వతి, మహాలక్ష్మి విగ్రహాలతో పాటు వినాయకుడు, నాగశేషుడి విగ్రహాలు సైతం ఉన్నాయి. అదిలాబాద్ శివార్లలో ఉండే ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాన్ని మహాలక్ష్మివాడ అని పిలుస్తారు. ప్రధానంగా శుభకార్యాలు మొదలుపెట్టే సమయంలో ఈ ఆలయాన్ని ఎక్కువమంది దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరతాయని చాలామంది భావిస్తారు. కొంతమంది కోరికలు నెరవేరిన తర్వాత ఈ ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని సౌకర్యాలను కల్పిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఈ ఆలయం కూడా ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత కోరిన కోరికలు తీరాయని చాలామంది భక్తులు చెబుతున్నారు.