Health Tips:పెద్ద ప్రేగు క్యాన్సర్ సమస్యా? అయితే ఈ ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి..!

Health Tips:పూర్వంతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అనేక వ్యాధులకు గురవుతున్నారు. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అటువంటి వాటిలో ఒకటి క్యాన్సర్. ఎంతోమంది ఈ వ్యాది బారిన పడి సతమతమవుతున్నారు. అనేక రకాల క్యాన్సర్లు శరీరాన్ని సతమతం చేస్తున్నాయి. మహిళ లలో అయితే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువమందిని కలవర పెడుతున్న క్యాన్సర్ రకం పెద్దపేగు క్యాన్సర్. ఇది ఎంతో ప్రాణాంతకమైనది.

తీసుకున్న ఆహారం అంత జీర్ణం అయిన తర్వాత మిగిలిన వ్యర్థాలను బయటకి పంపడానికి పెద్దప్రేగు ఎంతో సహాయపడుతుంది. పెద్ద ప్రేగు కు సోకే క్యాన్సర్ ను కొలన్ క్యాన్సర్ అని అంటారు. పెద్ద ప్రేగు చివరి భాగమైన పాయువు (రెక్టం) కు వచ్చే క్యాన్సర్ ను రెక్టల్ క్యాన్సర్ అని అంటారు. ఏదైనా క్యాన్సర్ ను నివారించడానికి ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినడం వల్ల క్యాన్సర్ బారినుండి విముక్తి పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేరీల్యాండ్ (USA) లు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో తేలింది ఈ విషయాలను వెల్లడించారు.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ను నిర్మూలించవచ్చని, అయితే ప్రాసెస్డ్ ఫైబర్ కాకుండా సహజ సిద్ధంగా దొరికే ఫైబర్ ఉండే ఆహరం తినడం మంచిదని సలహా ఇచ్చారు. పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలలో అధికంగా ఫైబర్ దొరుకుతుందని అధ్యయనం వెల్లడించింది.

ఇవే కాకుండా పెద్ద ప్రేగు క్యాన్సర్ కు దారితీసే మూలకణాల పై మన వంటింట్లో దొరికే పదార్థం మీద దాడి చేస్తుంది అని ఇది అన్ని చోట్ల దొరుకుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది మరి ఏదో కాదు మన వంటలలో ఉపయోగించే పసుపు. పసుపుకు పెద్ద పేగు క్యాన్సర్ నీ నివారించే గల తత్వం ఉంది అని సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల బారి నుండి మనల్ని రక్షించుకోవచ్చు.