Home News మనవడు అంటే కేసీఆర్ కు అంత ప్రాణం మరి.. ఏం చేశారో చూడండి

మనవడు అంటే కేసీఆర్ కు అంత ప్రాణం మరి.. ఏం చేశారో చూడండి

ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు దైవ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఎందుకంటే ప్రజల్లో రకరకాల కులాలకు, మతాలకు చెందిన వారు ఉంటారనే ఉద్దేశంతో చెప్తుంటారు. కానీ ఇదేమి చట్టం కాదు, కనీస బాధ్యతని కూడా రాజ్యాంగంలో లేదు కాబట్టి ఎవ్వరు దీన్ని పట్టించుకోరు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి చాలా ఎక్కువ. ఆయన చేసినన్ని పూజలు ఎవ్వరు చెయ్యరు. ప్రభుత్వం చేసే పనులను కూడా ముహూర్తం ప్రకారం చేస్తారని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. సీఎం కేసీఆర్ మాదిరే ఆయన మనమడు హిమాన్షుకు దైవభక్తి ఎక్కువ. పూజలు, పునస్కారాలు చేస్తుంటారు.
Images 7 | Telugu Rajyam
వినాయకచవితి వచ్చిందంటే చాలు.. ఖైరతాబాద్ గణేశుడి వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవటం అతనికి అలవాటు. కరోనా నేపథ్యంలో.. ప్రగతిభవన్ లోనూ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ పూజలకు కేసీఆర్ హాజరయ్యారు.

అందులోని అథ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి తన అసలైన వారసుడిగా హిమాన్షును కేసీఆర్ భావిస్తారని చెబుతారు. ఈ పూజలో పాల్గొనటం కోసం ఆయన ఫామ్ హౌస్ నుంచి వచ్చారని చెబుతారు. హిమాన్షు పూజ చేస్తుంటే సీఎం కేసీఆర్, ఆయన సతీమణి, కోడలు శైలిమ, ఎంపీ సంతోష్ తోపాటు, పలువురు భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు కానీ హిమాన్షు తండ్రి, మంత్రి కేటీఆర్ మాత్రం హాజరు కాలేదు. కేటీఆర్ కు కేసీఆర్, హిమాన్షు కు ఉన్నంత దైవ చింతన లేదని కేసీఆర్ సన్నిహితులు చెప్తుంటారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా కేసీఆర్ తన మనవుడు ఏర్పాటు చేసిన పూజకు రావడంతో మనవుడు అంటే కేసీఆర్ కు ఎంత ప్రేమో అని సోషల్ మీడియాలో పూజ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో వాటిని తగ్గించడానికి వ్యూహాలు రచించకుండా ఇలా పూజలు చేయడం అవసరమా! అని కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Posts

ఈ దెబ్బతో రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ అడ్రెస్ గల్లంతే 

రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవికి దూరం చాలా పెరిగిపోయింది.  అంటిన ఆ బురదను వదిలించుకోవడానికి ఆయనకు ఏడెనిమిదేళ్లు పట్టింది.  ఏనాడూ ఎవ్వరి చేత ఒక్క మాట పడి ఎరుగని చిరు రాజకీయాల మూలంగా చిన్న చిన్న వ్యక్తుల  విమర్శలకు...

బ్యాట్‌తో రొమాన్స్ మొద‌లు పెట్టిన తాప్సీ.. ఇక సిక్స‌ర్ల మోత మోగాల్సిందే అంటున్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన న‌టి తాప్సీ ప‌న్ను. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఆమె సొంతం. కెరీర్ తొలి నాళ్ళ‌లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌టించిన తాప్సీ...

ప‌వ‌న్ ఎవ‌రి మాట విని మ‌ళ్ళీ సినిమాల్లోకి వ‌చ్చారో తెలుసా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరులోనే ఓ ప్ర‌భంజ‌నం ఉంది. అతి త‌క్కువ టైంలోనే అశేష అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకున్నారు ప‌వన్. కేవ‌లం సినిమాల‌తోనే కాక చేసే మంచి ప‌నుల‌తోను ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విస్తృతంగా...

టెన్త్ ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం !

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది పరీక్షలు లేకుండా పదో తరగతి విద్యార్థులను పాస్ చేశారు. ఇంటర్నల్ మార్క్‌లు, అటెండెన్స్ ఆధారంగా గ్రేడ్‌లు కేటాయించారు. అయితే , ఈసారి కూడా క్లాసులు...

Latest News