నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ లో జరిగిన అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. మా తెలుగు తల్లికి.. గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈసందర్భంగా సీఎం జగన్.. తెలుగు తల్లికి, పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు సీఎం జగన్ తెలిపారు.
పొట్టి శ్రీరాములుతో పాటు చాలామంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు అందరినీ ప్రేరేపిస్తాయి. అటువంటి మహానుభావుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. స్ఫూర్తిగా తీసుకోవాలి… రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో ముందుకెళ్లాలి.. అని సీఎం తెలిపారు.
ఈసందర్భంగా సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన ఆ మహాశయున్ని స్మరించుకుంటూ ఏపీ అవతరణ దినోత్సవాన్ని మళ్లీ కొనసాగించడం సంతోషంగా ఉంది.. అని జగన్ ట్వీట్ చేశారు.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దేశంలో బాటలు వేసిన ఆ మహాశయున్ని స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్ళీ కొనసాగించడం సంతోషంగా ఉంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2020