ఏపీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పనిచేయనివారిని పక్కనపెట్టి.. పనిలో చురుకుతనం చూపించేవారికి మరిన్ని శాఖలు అప్పగించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కేబినెట్ లో కొనసాగుతున్న కొందరికి ఉద్వాసన తప్పదనే చెబుతున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యలో ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఇద్దరికి మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించే పనిలో సీఎం జగన్ ఉన్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మంత్రులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో కొన్నికొన్ని శాఖల్లో ఆదాయం రావడం లేదు. 3,4 శాఖల్లో ఆదాయం తగ్గడంతో జగన్ కూడా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ధరలు పెంచినా సరే కొన్ని శాఖల్లో ఆదాయం రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని శాఖల అధికారుల పనితీరు విషయంలోనూ జగన్ సమీక్ష చేస్తున్నారు. ఇక మంత్రులకు కొన్నికొన్ని శాఖలు మర్చే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లు సమాచారం. జలవనరుల శాఖ, ఆర్థికశాఖ, సహా పర్యాటకశాఖలలో ముఖ్యమంత్రి మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వీరి విషయంలో సమీక్ష చేసిన జగన్ సంతృప్తిగా లేరని ఒక ఆయా శాఖల అధికారులు కూడా మంత్రులకు పెద్దగా సహకరించడం లేదనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఆయా శాఖల్లో మార్పులు చేసేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం అనేది కాస్త ఇబ్బంది కరంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా జగన్ చర్యలకు దిగుతున్నారు. సమర్థవంతంగా పనిచేసే మంత్రులకు మరికొన్ని శాఖలు కూడా అప్పగించే అవకాశం ఉందని సమాచారం. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకి అలాగే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మరికొన్ని శాఖలు అదనంగా అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కర్నూలు, కడప జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. వారి పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.