ఇప్పుడంటే దక్షిణాదిన రాత్రివేళ్లల్లో భోజనం మాని.. లైట్ ఫుడ్ చేస్తున్నారు. అందులో పుల్కా, చపాతి.. వంటివి ఉంటున్నాయి. ఉత్తరాదిలో ఇదెప్పటినుంచో చేస్తున్నారు. ఆరోగ్యం కోసం అని చెప్పలేం కానీ.. వాళ్ల డిన్నర్ లో చపాతీ, పుల్కానే ఉంటుంది. ఇలా ప్రతిరోజూ తినడం మంచిదేనా అనే సందేహాలు ఉన్నాయి. కానీ.. పొట్ట రాకూడదని, రాత్రిళ్లు తేలిగ్గా జీర్ణం అయ్యేందుకే చపాతీ తీసుకుంటారని అంటారు. అయితే.. రాత్రివేళ రెగ్యులర్ గా చపాతి తినేవారు కొన్ని నియమాలు పాటించాలని డాక్టర్లు చెప్తున్నారు.
రాత్రిపూట నిద్రకు కనీసం రెండు గంటల ముందే.. చెప్పాలంటే 8లోపే తినడం పూర్తి చేయాలని చెప్తూంటారు డాక్టర్లు. పైగా.. రాత్రిళ్లు అన్నం వద్దని కూడా చెప్తారు. నిద్రతో శరీరానికి శ్రమ ఉండదు కాబట్టి ఒళ్లు వస్తుందని.. షుగర్ లెవల్స్ పెరుగుతారని ఉండే అనుమానాలే ఇందుకు కారణం. అందుకే రాత్రిపూట చపాతీలు తినమంటారు డాక్టర్లు. దీని వల్ల చాలా లాభాలున్నాయి కాబట్టే.. డాక్టర్లు ఆ మాట చెప్తున్నారు. ఎందుకంటే నిల్వ ఉన్న చపాతీలతో బలం ఎక్కువ. అంటే.. ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రి కూడా తినొచ్చు. చపాతీల్లో కొవ్వు ఉండదు. చపాతీల్లో నెమ్మదిగా జీర్ణం అయ్యే గుణం వల్ల బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. నెమ్మదిగా అరిగే గుణం వల్ల రాత్రిళ్లు నెమ్మదిగా ఉండే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందంటున్నారు డాక్టర్లు.
రాత్రిపూట అన్నం కంటే చపాతీ ఎక్కువ బలాన్నిస్తుంది. రెండు, మూడు చపాతీల కంటే ఎక్కువ తనకపోవడమే బెటర్. గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి హిమోగ్లోబిన్ శాతం పెరిగి గుండెకు మంచి చేస్తుంది. చపాతీలను ఆ సమయంలో తక్కువ నూనెతో.. లేదంటే అసలు నూనె లేకుండా కాల్చడం మరీ ఉత్తమం. ఇది శరీర బరువు పెరగనివ్వకుండా చేస్తుంది. చపాతీలు తిన్న రెండు గంటల తర్వాతే నిద్రపోవాలి. రోజూ టైమ్ ప్రకారం చపాతీలు తింటే మరీ మంచిది. రాత్రి 7 నుంచి 10లోపు చపాతీలు తినేందుకు మంచి సమయం. చపాతీల్లో రోజుకో రకం కూర ఉంటే బెటర్. మైదా కలపని విధంగా ఇప్పుడు గోధుమ పిండి ప్యాకేజీల్లో వస్తుంది. మంచి బ్రాండెడ్ గోధుమ పిండి కొనుక్కోవాలి. దానిపై మైదా జీరో శాతం, గోధుమ వంద శాతం అని ఉండాలి.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.