సినిమాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ కమెడియన్ పృద్వికి ఎంత ఫేమసో, అలాగే రాజకీయాల్లో 40 ఇయర్స్ అనుభవం అనే డైలాగ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా అంత ఫేమస్. రాజకీయాల్లో నాయకులు మాట్లాడే అన్ని మాటలకు ఆధారాలు ఉండవు, వాటినే ఆరోపణలు అంటారు.
ఇప్పుడున్న రాజకీయ నాయకులు మాట్లాడేవాన్ని ఆరోపణలే అందుకే జనాలు కూడా ఏ రాజకీయ నాయకుడు ఏమి మాట్లాడినా ఎవ్వరు పట్టించుకోరు. ఆరోపణలు చేయడానికే కొందరిని పార్టీలోకి తీసుకునే పార్టీ అధినేతలు ఉన్నారు. ఖచ్చితమైన ఆధారాలతో ప్రతి పక్షాన్ని విమర్శించే అధికార పక్షాన్ని గాని, ప్రతి పక్షాన్ని మనం ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేదు. నోటికి ఇష్టమొచ్చింది, ప్రజలను వెర్రి వాళ్ళను చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజగా చంద్రబాబు చేస్తున్న పనులు కూడా ఈ కోవకు చెందినవే.
ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఊపందుకుంది.
ప్రతి వార్త పత్రిక, టీవీ చానెల్స్ అన్ని విటిపైనే కథనాలు ప్రచురిస్తున్నాయి. తాజగా టీడీపీ అధినేత కూడా ఈ వ్యవహారంలో కలిపించుకొని ఈ విషయంపై ఏకంగా ప్రధానికి లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాజ్యాంగంలోని 1921 ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అవుతున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అయితే 40 అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం కొన్ని పత్రికలు రాస్తున్న కథనాల ఆధారంగా మోడీకి లేఖ రాయడం ఏంటని రాజకీయ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. జనాల్లో ఈ విషయంపై ఇంకొంచెం చర్చ జరగడానికి చంద్రబాబు ఈ పని చేశారని, ఇదొక చీప్ ట్రిక్ అని వైసీపీ నాయకులు అంటున్నారు. అయిన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి మరీ తెలుసుకునేంత సీరియస్ విషయాలు ఇప్పుడు టీడీపీలో ఏమి జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ లేఖపైన స్పందించిన కేంద్రం… ఆధారాలు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి తనకు ఉన్న విలువను పోగొట్టుకున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.